కుటుంబానికి ధీమాగా..

కుటుంబం అంతటికీ ఆర్థిక ధీమా కల్పించేలా పొదుపు, రక్షణ కలిసిన పాలసీని ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌

Updated : 29 Oct 2021 04:55 IST

కుటుంబం అంతటికీ ఆర్థిక ధీమా కల్పించేలా పొదుపు, రక్షణ కలిసిన పాలసీని ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని ఈ బీమా సంస్థ విడుదల చేసిన ఈ పాలసీ పేరు సరళ్‌ బచత్‌ బీమా. పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించి, దీర్ఘకాలం రక్షణ పొందే ఏర్పాటు ఇందులో ఉంది. పాలసీదారుడు అయిదేళ్లు లేదా ఏడేళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రక్షణ 12 లేదా 15 ఏళ్లపాటు కొనసాగేలా ఏర్పాటు చేసుకోవచ్చు. పాలసీదారుడికి అనుకోనిదేదైనా జరిగితే.. కుటుంబ సభ్యుల భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు ఇది అండగా ఉంటుంది. పాలసీతీసుకున్న ఏడాదిలో ప్రమాదవశాత్తూ మరణిస్తే.. అదనపు బీమా రక్షణ లభిస్తుంది. పాలసీ తీసుకునేందుకు ఆరోగ్య పరీక్షల అవసరం లేదు. పాలసీ వ్యవధి తీరిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తారు. 4.75%-6% వరకూ హామీతో కూడిన వార్షిక రాబడి అందుతుందని సంస్థ పేర్కొంది. వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం రైడరల్‌లాంటివి ఎంచుకోవచ్చు. పాలసీదారుడు మరణించినప్పుడు.. నామినీ పరిహారం ఒకేసారి తీసుకోవచ్చు. లేదా అయిదేళ్లపాటు క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. చెల్లించిన ప్రీమియానికి ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని