- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
విదేశీ స్థిరాస్తి ప్రాజెక్టులలో..
వివిధ దేశాల్లో స్థిరాస్తి రంగంలో పరోక్ష పెట్టుబడికి వీలు కల్పించే ‘పీజీఐఎం ఇండియా గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఫండ్ ఆఫ్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది. దీని కింద సమీకరించే నిధులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు, రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) లలో పెట్టుబడి పెట్టే పీజీఐఎం గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. తద్వారా మదుపరులకు దీర్ఘకాలిక లాభాలు ఆర్జించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. దీనికి రవి అడుకియా ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.
ఈ పథకం ఎన్ఎఫ్ఓ (న్యూ ఫండ్ ఆఫర్) ఈ నెల 29న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. మనదేశంలో ఇదే మొదటి గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఫండ్. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరణంలో ప్రపంచ వ్యాప్తంగా సాధారణ, వ్యాపార కార్యకలాపాలు మళ్లీ మొదలై జోరందుకుంటున్నాయి. హోటళ్లు, ఆఫీసు స్థలం, పర్యాటక ప్రదేశాలు, రెస్టారెంట్లు, సమావేశ ప్రాంగణాలు, రిమోట్ వర్కింగ్, ఈ-కామర్స్... తదితర విభాగాల నుంచి ఆఫీసు స్థలానికి, వాణిజ్య ప్రాంగణాలకు విశేష గిరాకీ లభిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక పెట్టుబడులు పెట్టేందుకు, ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని ఆర్జించేందుకు అవకాశాలు పెరిగాయి. ప్రపంచ స్థాయి ఏ- గ్రేడ్ వాణిజ్య, స్టోరేజీ, లాజిస్టిక్స్, లాస్ట్ మైల్ రిటైల్, సీనియర్ లివింగ్, కోల్డ్ స్టోరేజీ విభాగాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడి అవకాశాలు మనదేశంలో తక్కువ. ఇటువంటి పెట్టుబడి అవకాశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తాయి. తమ పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలనుకుంటూ..., కేవలం ఈక్విటీ, లేదా రుణ పత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో లిక్విడ్ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉన్న మదుపరులు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
చైనా టెక్ షేర్లలో పెట్టుబడికి....
‘మిరే అసెట్ హ్యాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్’ అనే ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాన్ని మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. దీని పనితీరును ‘హ్యాంగ్ సెంట్ టెక్ టీఆర్ఐ ఇండెక్స్’ తో పోల్చి చూస్తారు. ఈ కొత్త పథకం కింద సేకరించే నిధులను మిరే అస్సెట్ హ్యాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ యూనిట్లో పెట్టుబడిగా పెడతారు.
ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 29. కనీస పెట్టుబడి రూ.5,000.
దీని ప్రత్యేకతలు...
* ప్రధానంగా హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన 30 అతిపెద్ద చైనా టెక్ కంపెనీల షేర్లలో పరోక్షంగా పెట్టుబడి పెట్టే అవకాశం భారతీయ మదుపరులకు ఈ పథకం ద్వారా లభిస్తుంది.
* క్లౌడ్, ఏఐ, ఐఓటీ విభాగాల్లో ఈ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
* హ్యాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ ఏడేళ్లలో అయిదు సంవత్సరాల పాటు నిఫ్టీ- 50 కంటే అధిక ప్రతిఫలాన్ని అందించింది. హ్యాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ చరిత్రాత్మక సగటు స్థాయితో పోల్చితే ప్రస్తుతం 38 శాతం డిస్కౌంటులో ట్రేడ్ అవుతోంది. అందువల్ల అక్కడ టెక్ షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన తరుణం.
* టెక్, డిజిటల్ కంపెనీలు చైనా ఆర్థిక వ్యవస్థకు వెనుదన్నుగా ఉన్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ అనూహ్యమైన వృద్ధి సాధించటానికి వీలుకల్పించిన కారణాల్లో ఇది ఒకటి. ఇంకా అధిక వృద్ధికి ఈ కంపెనీలు వీలు కల్పిస్తాయని అంచనా.
* హ్యాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు మనదేశంలోకి మదుపరులకు ‘మిరే అసెట్ హ్యాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్’ ఒక అవకాశమని చెప్పొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
India News
Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: నీతీశ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Crime News: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!