అధిక ప్రతిఫలం ఇచ్చే కంపెనీల్లో

కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌, మనదేశంలో తొలిసారిగా ‘కోటక్‌ నిఫ్టీ ఆల్ఫా 50 ఈటీఎఫ్‌’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 15 వరకూ ఉంటుంది.

Published : 10 Dec 2021 01:04 IST

కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌, మనదేశంలో తొలిసారిగా ‘కోటక్‌ నిఫ్టీ ఆల్ఫా 50 ఈటీఎఫ్‌’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 15 వరకూ ఉంటుంది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకంలో కనీస పెట్టుబడి రూ.5,000. నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్‌తో దీని పనితీరును పోల్చి చూస్తారు. అధిక ఆల్ఫా (అధిక ప్రతిఫలం) కల వివిధ వ్యాపార విభాగాల్లోని కంపెనీలను ఎంపిక చేసి ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టి మదుపరులకు అధిక లాభాలు ఆర్జించాలనేది దీని లక్ష్యం. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన 300 అతిపెద్ద కంపెనీల ఫ్రీ-ఫ్లోట్‌ మార్కెట్‌ కేపిటలైజేషన్‌, సగటు రోజువారీ ట్రేడింగ్‌ టర్నోవర్‌, గత ఆరు నెలల కాలంలో ఎలా ఉందనేది విశ్లేషించి, అందులో అధిక ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం గల కంపెనీలను పెట్టుబడికి ఎంపిక చేస్తారు. ఇది ఈటీఎఫ్‌ పథకం కాబట్టి, నిర్వహణ వ్యయాలు తక్కువ. ఆ మేరకు మదుపరులకు మేలే. ఇండెక్స్‌ ఆధారంగా పెట్టుబడులు నిర్ణయిస్తారు కాబట్టి, ఫండ్‌ మేనేజర్‌ విచక్షణ తక్కువగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని