Updated : 17 Dec 2021 06:46 IST

పెద్దలకు ఆరోగ్య ధీమా..

సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ‘యాక్టివ్‌ హెల్త్‌ ఎసెన్షియల్‌’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న తొలి రోజు నుంచే తీవ్రమైన వ్యాధులకు సైతం కవరేజీ లభించడం ఈ పాలసీ ప్రత్యేకత. పాలసీదారుడు ‘కో-పేమెంట్‌’ రద్దు కోరవచ్చు. ఆరోగ్యవంతమైన జీవన శైలిని అనుసరించే వారికి ప్రోత్సాహకరంగా ప్రీమియంలో దాదాపు సగం మొత్తాన్ని పాలసీదారుడికి చెందిన ‘హెల్త్‌ రిటర్న్‌’ ఖాతాలో భద్రపరుస్తారు. సీనియర్‌ సిటిజన్లకు వైద్య సలహాలు, ఇతర జాగ్రత్తలూ లభిస్తాయి. కొవిడ్‌-19 మహమ్మారి ఎంతో మంది పెద్దలకు హాని చేసింది. ఆసుపత్రుల్లో చేరి ఖర్చులు భరించలేక ఇబ్బందిపడిన సంఘటనలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దలకు సరైన ఆరోగ్య బీమా అవసరం ఎంతో ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రత్యేక పాలసీని విడుదల చేసినట్లు సంస్థ అంటోంది.


విశ్రాంత జీవితంలో నిశ్చింతగా...

దవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిశ్చింతగా జీవితాన్ని గడపటానికి అనువైన ‘సిస్టమేటిక్‌ రిటైర్‌మెంట్‌ ప్లాన్‌’ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. మనదేశంలో ప్రజల జీవన కాలం పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం సైతం అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం లేకపోతే కష్టమే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కాబట్టి పెద్దలకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలే. ఈ పరిస్థితుల్లో ఒక క్రమబద్ధమైన పదవీ విరమణ అనంతర జీవితాన్ని గడపటానికి ఈ పథకం వీలు కల్పిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేర్కొంది.

* ఈ పథకం కింద ప్రీమియం చెల్లింపు కాలాన్ని 5 నుంచి 15 ఏళ్ల వ్యవధిలో ఎంచుకోవచ్చు. 15 ఏళ్ల వరకూ ‘డిఫెర్‌మెంట్‌’ అవకాశం ఉంటుంది.

* ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

* యాన్యూటీ రేటు ముందే ఖరారవుతుంది. పాలసీ గడువు తీరే వరకూ అదే కొనసాగుతుంది. యాన్యూటీని నెల, మూడు నెలలకోసారి, ఆర్నెల్లు లేదా ఏడాదికోసారి పొందవచ్చు.

* పాలసీదారుడు మరణించిన తర్వాత ప్రీమియం మొత్తం నామినీకి చెల్లిస్తుంది.

* కనీసం 45 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ ప్లాన్‌ తీసుకునేందుకు అర్హులు, గరిష్ఠ వయో పరిమితి 75 సంవత్సరాలు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని