దీర్ఘకాలంలో వృద్ధికి..

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, యాక్సిస్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000. న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 7న ప్రారంభమై, ఈ

Updated : 07 Jan 2022 05:56 IST

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, యాక్సిస్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000. న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 7న ప్రారంభమై, ఈ నెల 21న ముగుస్తుంది. ‘నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఇండెక్స్‌ టీఆర్‌ఐ’ని ఈ ఫండ్‌ పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ‘నిఫ్టీ 100’ సూచీలో నిఫ్టీ 50 తర్వాత ఉండే 50 కంపెనీ షేర్లలో మదుపు చేయడం ద్వారా అధిక లాభాలు ఆర్జించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. నిఫ్టీ నెక్ట్స్‌ 50లో భవిష్యత్తులో అగ్రగామిగా ఎదిగే అవకాశం ఉన్న కంపెనీలు ఉన్నట్లు, ప్రస్తుత దశలోనే వాటిపై పెట్టుబడి పెట్టటం ద్వారా దీర్ఘకాలంలో ఎన్నో రెట్లు అధిక ప్రతిఫలాన్ని ఆశించవచ్చని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ భావిస్తోంది.


‘మిడ్‌క్యాప్‌’ లాభాల కోసం

కోటక్‌ మిడ్‌క్యాప్‌ 50 ఈటీఎఫ్‌ స్కీమ్‌’.. కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్తగా అందుబాటులోకి రాబోతోంది. దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 20. కనీస పెట్టుబడి రూ.5,000. ‘నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50 ఇండెక్స్‌’ తో ఈ ఫండ్‌ పనితీరును పోల్చి చూస్తారు. 2004 నుంచి... ఈ 18 ఏళ్ల కాలంలో, 11 ఏళ్ల పాటు నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌, నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 500 కంటే అధిక వృద్ధి నమోదు చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50 వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 44.9 శాతం ఉండగా, నిఫ్టీ 50 అయితే 25.6 శాతం, నిఫ్టీ 500 దాదాపు 31.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. ఈ కొత్త ఫండ్‌ దాదాపుగా నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50 ఇండెక్స్‌ను పోలి ఉంటుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 ఇండెక్స్‌ నుంచి ఎఫ్‌అండ్‌ఓలో ఉన్న 50 కంపెనీలను ఎంచుకొని పోర్ట్‌ఫోలియో నిర్మిస్తారు. ఒకవేళ ఎఫ్‌అండ్‌ఓలో 50 కంపెనీలు లేకుంటే... ఉన్న కంపెనీల మేరకే పెట్టుబడులను పరిమితం చేస్తారు. ప్యాసివ్‌ ఫండ్ల వైపు వైపు కొంతమేరకు తమ పెట్టుబడులను మళ్లించాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ పథకం అనువుగా కనిపిస్తోంది. దీనికి తోడుగా మిడ్‌క్యాప్‌ విభాగంలో కనిపించే అధిక వృద్ధి అవకాశాలనూ అందుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని