విదేశీ ఈక్విటీల్లోనూ...

సామ్‌కో మ్యూచువల్‌ ఫండ్‌, తన మొదటి పథకంగా ‘సామ్‌కో ఫ్లెక్సిక్యాప్‌ ఫండ్‌’ ను ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ డైనమిక్‌ ఈక్విటీ పథకం. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన సమర్థమైన కంపెనీల షేర్లను సరైన ధరలో కొనుగోలు

Published : 14 Jan 2022 03:55 IST

సామ్‌కో మ్యూచువల్‌ ఫండ్‌, తన మొదటి పథకంగా ‘సామ్‌కో ఫ్లెక్సిక్యాప్‌ ఫండ్‌’ ను ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ డైనమిక్‌ ఈక్విటీ పథకం. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన సమర్థమైన కంపెనీల షేర్లను సరైన ధరలో కొనుగోలు చేయటం, నిర్వహణ వ్యయాలను అదుపులో పెట్టుకోవటం ద్వారా మదుపరులకు అధిక ప్రతిఫలాన్ని ఆర్జించాలనేది ఈ పథకం లక్ష్యంగా సామ్‌కో మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది. దాదాపు 65 శాతం నిధులను దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన కంపెనీ షేర్లపై పెట్టుబడికి కేటాయిస్తారు. మిగిలిన 35 నిధులతో విదేశీ ఈక్విటీలు కొనుగోలు చేస్తారు. మొత్తం 25 కంపెనీలకే పోర్ట్‌ఫోలియోను పరిమితం చేస్తారు. ‘సామ్‌కో ఫ్లెక్సిక్యాప్‌ ఫండ్‌’ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 17న ప్రారంభం అవుతుంది. ఈ నెల 31 ముగింపు తేదీ. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ. 5,000. సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌) పద్ధతిలో రూ.500. ఈ పథకం పనితీరుకు నిఫ్టీ 500 టీఆర్‌ఐని ప్రామాణికంగా తీసుకుంటారు. నిరాలి భన్సాలీ ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. విదేశీ ఈక్విటీ పెట్టుబడులను ధావల్‌ ధనాని పర్యవేక్షిస్తారు.


ఉత్పత్తి రంగంలో..

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక ఈటీఎఫ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ‘మిరే అసెట్‌ నిఫ్టీ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఈటీఎఫ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 20. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. నిఫ్టీ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ టీఆర్‌ఐ (టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌)తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ప్రధానంగా ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. విద్యుత్తు వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌, బ్యాటరీ టెక్నాలజీస్‌, డిఫెన్స్‌ ఉత్పత్తులు అందించే కంపెనీలపై దృష్టి కేంద్రీకరించే ఉద్దేశం ఈ పథకానికి ఉంది. దీనికి ఏక్తా గుప్తా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని