సెన్సెక్స్‌ షేర్లలో..

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఒక ఇండెక్స్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ఇది లార్జ్‌ క్యాప్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దీని ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 24. ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో కనీస పెట్టుబడి రూ.5,000.

Updated : 21 Jan 2022 12:17 IST

యూటీఐ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఒక ఇండెక్స్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ఇది లార్జ్‌ క్యాప్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దీని ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 24. ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో కనీస పెట్టుబడి రూ.5,000. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టీఆర్‌ఐతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. యూటీఐ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌కు శర్వాణ్‌ కుమార్‌ గోయల్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ప్రధానంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో ఈ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది. తద్వారా స్థిరమైన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఫండ్‌ నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం మరొక సానుకూలత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని