‘మొమెంటమ్‌’ ఆధారిత లాభాలు..

మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, కొత్తగా ఒక ఓపెన్‌ ఎండెడ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 4. ఇందులో కనీస పెట్టుబడి రూ.500.

Updated : 28 Jan 2022 04:19 IST

మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, కొత్తగా ఒక ఓపెన్‌ ఎండెడ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 4. ఇందులో కనీస పెట్టుబడి రూ.500. ‘నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 టీఆర్‌ఐ’ తో ఈ పథకం పనితీరును పోల్చిచూస్తారు.

గత కొంతకాలంగా ‘మొమెంటమ్‌ ఫ్యాక్టర్‌’ ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్లు, అందుకే విభిన్నమైన పథకాన్ని ఆవిష్కరించినట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ వివరిస్తోంది.

నిఫ్టీ 200 ఇండెక్స్‌ నుంచి గత ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో ‘ఇండెక్స్‌ మెథడాలజీ’ లో నిర్దేశించిన ‘మొమెంటమ్‌ ఫ్యాక్టర్‌’ ప్రకారం 30 కంపెనీలను ఈ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం పోర్ట్‌ఫోలియో కోసం ఎంపిక చేస్తారు. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 65 శాతం లార్జ్‌ క్యాప్‌ షేర్లే ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి సిద్ధంగా ఉన్న మదుపరులకు ఈ పథకాలు అనుకూలం.


నాలుగోతరం సాంకేతికత సంస్థల్లో

డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌, ఓవర్సీస్‌ ఫండ్‌-ఆఫ్‌-ఫండ్‌ ఒకదాన్ని తీసుకువచ్చింది. ‘డీఎస్‌పీ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 7. కనీస పెట్టుబడి రూ.500. మెటావర్స్‌, సెమీకండక్టర్స్‌, బ్లాక్‌చైన్‌, 5జీ, జీన్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ, స్పేస్‌, విద్యుత్తు వాహనాలు... తదితర నాలుగోతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆ పరిజ్ఞానం ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించే కంపెనీలపై పెట్టుబడి పెట్టే మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ‘డీఎస్‌పీ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ పెట్టుబడులు ఉంటాయి. ఈ పథకం దీర్ఘకాలంలో బాగుండే అవకాశం ఉంటుంది. మదుపు చేయాలనుకునే వారు సిప్‌ (క్రమానుగత పెట్టుబడి) పద్ధతిలో స్వల్ప మొత్తాలను దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టటం మేలు. అప్పుడే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించి అధిక లాభాలు గడించే కంపెనీలపై పెట్టుబడులు అధిక ప్రతిఫలాన్ని సాధించేందుకు అవకాశం ఉంటుంది.


అన్ని తరగతుల షేర్లలో

టీవల పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఫ్లెక్సీ క్యాప్‌ పథకాలను ఆవిష్కరించిన విధంగానే ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌, ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ‘ఇన్వెస్కో ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 7తో ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓ కనీస పెట్టుబడి రూ.1,000. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లు ఉంటాయి. ‘ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ’ని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.  ఫ్లెక్సీ క్యాప్‌ పథకాల్లో పెట్టుబడులపై రిస్కును తగ్గించి, అధిక ప్రతిఫలాన్ని ఆర్జించటానికి తరచుగా పోర్ట్‌ఫోలియోను మార్చే అవకాశం ఫండ్‌ మేనేజర్‌కు ఉంటుంది. మార్కెట్‌ స్థితిగతులను బట్టి, లార్జ్‌ క్యాప్‌ నుంచి ఇతర తరగతులకు చెందిన షేర్లు, లేదా మిడ్‌/ స్మాల్‌ క్యాప్‌ నుంచి లార్జ్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లకు పెట్టుబడులను మళ్లించవచ్చు. తద్వారా అధిక లాభాలు ఆర్జించటానికి ఫండ్‌ మేనేజర్‌ ప్రయత్నించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని