ఉత్పత్తి రంగంపై భరోసాతో

‘కోటక్‌ మాన్యుఫ్యాక్చర్‌ ఇన్‌ ఇండియా ఫండ్‌’ అనే వినూత్నమైన పథకాన్ని కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 15. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ

Published : 04 Feb 2022 00:36 IST

‘కోటక్‌ మాన్యుఫ్యాక్చర్‌ ఇన్‌ ఇండియా ఫండ్‌’ అనే వినూత్నమైన పథకాన్ని కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 15. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. ‘నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ టీఆర్‌ఐ’ని ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా తీసుకుంటారు.

నదేశంలో ఉత్పత్తి రంగం వేగంగా విస్తరిస్తున్నట్లు, ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలను గుర్తించి తద్వారా అధిక లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ రూపొందించింది. సమీకరించిన సొమ్మును ఉత్పత్తి కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థల్లో పెట్టుబడిగా పెడతారు. ‘‘ఉత్పత్తి రంగంలో ఎదిగే అవకాశాన్ని 1980లో రాగా, దాన్ని మనదేశం చేజార్చుకుంది. అదే సమయంలో ఐటీ రంగంలో అడుగుపెట్టి ఈరోజు అగ్రస్థానంలో నిలిచాం. ఇటీవల కాలంలో మారిన ప్రపంచ రాజకీయ సమీకరణలతో వివిధ దేశాలు ‘చైనా ప్లస్‌ వన్‌’ విధానాన్ని అనుసరిస్తున్నందున మనదేశం నుంచి వస్తువులు ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతున్నాయి.   ఈ మార్పును అందిపుచ్చుకొని లాభాలు ఆర్జించటమే ఈ పథకం లక్ష్యం’’ అని కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ వివరిస్తోంది.


‘ప్యాసివ్‌’ తరహా పెట్టుబడికి

దేశీయ ఈక్విటీ ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)లలో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించే లక్ష్యంతో యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక ఓపెన్‌ ఎండెడ్‌ ఈటీఎఫ్స్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌ఓఎఫ్‌) ను ఆవిష్కరించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 18. తన పెట్టుబడులకు ‘టాప్‌ డౌన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విధానాన్ని’ ఈ పథకం అనుసరిస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. దీనికి శ్రేయాష్‌ దేవల్కర్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ‘నిఫ్టీ 500 టీఆర్‌ఐ’తో ఈ పథకాన్ని పోల్చిచూస్తారు. ‘ప్యాసివ్‌ పెట్టుబడి’ విధానంలో ఈటీఎఫ్‌లకు ఇటీవల కాలంలో అధికంగా ఆదరణ ఉన్న విషయం విదితమే. గత మూడేళ్ల వ్యవధిలో ఈటీఎఫ్‌ పథకాల్లో పెట్టుబడులు మూడింతలు పెరిగాయి. ఈ కొత్త పథకం  ఒకటి రెండు రంగాలకు పరిమితం కాకుండా ఎక్కడ అవకాశాలు ఉంటే, అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంటుంది. ప్రధానంగా దేశీయ ఈటీఎఫ్‌లలోనే 95 శాతం వరకూ మదుపు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని