గృహిణుల కోసం టర్మ్‌ పాలసీ

బీమా సంస్థలు గృహిణులకు జీవిత బీమా పాలసీలు అందిస్తున్నప్పటికీ.. అవి వారి జీవిత భాగస్వామి పాలసీల్లో అనుబంధంగానే ఉంటుంటాయి. ఇలా కాకుండా పూర్తిగా గృహిణులు తమ కోసమే ప్రత్యేకంగా సొంత పాలసీని తీసుకునే వెసులుబాటును

Published : 04 Feb 2022 00:37 IST

బీమా సంస్థలు గృహిణులకు జీవిత బీమా పాలసీలు అందిస్తున్నప్పటికీ.. అవి వారి జీవిత భాగస్వామి పాలసీల్లో అనుబంధంగానే ఉంటుంటాయి. ఇలా కాకుండా పూర్తిగా గృహిణులు తమ కోసమే ప్రత్యేకంగా సొంత పాలసీని తీసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌. ఈ టర్మ్‌ పాలసీ పేరు మ్యాక్స్‌ లైఫ్‌ స్మార్ట్‌ సెక్యూర్‌ ప్లస్‌ ప్లాన్‌. ఈ పాలసీని పాలసీబజార్‌.కామ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అందిస్తోంది. పూర్తిగా రక్షణకే పరిమితం అయ్యే టర్మ్‌ పాలసీ ఇది. గృహిణులకూ ఆర్థిక భద్రత కల్పించడంతోపాటు, భర్త జీవిత బీమా కవరేజీలో వారు భాగం కావాల్సిన అవసరాన్ని ఇది తప్పించనుంది. కుటుంబ ఆదాయం కనీసం రూ.5లక్షలు ఉన్న వారికి ఈ పాలసీ అందిస్తారు. 18-50 ఏళ్లలోపు వారు అర్హులు. గృహిణిగా ఒక మహిళ అందించే సేవలకు వెలకట్టలేం. ఈ పాలసీ భారతీయ మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడంలో తోడ్పడుతుందని మ్యాక్స్‌ లైఫ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.విశ్వనాథ్‌ అన్నారు. తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు సంబంధించిన అనుబంధ పాలసీలనూ జోడించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని