Interest Rate: చిన్న బ్యాంకుల్లో అధిక వడ్డీ

ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండటంతో గత కొంత కాలంగా బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. పొదుపు ఖాతాలో వడ్డీ 3%-3.5% మధ్య ఉంటోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా 5.5శాతం రాబడి మించడం లేదు.

Updated : 17 Apr 2022 22:32 IST

ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండటంతో గత కొంత కాలంగా బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. పొదుపు ఖాతాలో వడ్డీ 3%-3.5% మధ్య ఉంటోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా 5.5 శాతం రాబడి మించడం లేదు. దీంతో ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలో డబ్బును నిల్వ చేసేందుందుకు ఇష్టపడటం లేదు. కరోనా తర్వాత చాలామంది యువత స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోపాటు ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు అధిక ఆదరణ పొందుతున్నాయి. స్వల్పకాలంలో అధిక రాబడులు కనిపిస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఎన్ని పెట్టుబడులు ఉన్నా.. పొదుపు ఖాతా అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు పొదుపు ఖాతాపైన మెరుగైన వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇందులో కొత్తతరం చిన్న బ్యాంకులు ముందు వరుసలో ఉంటున్నాయి.

  • ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: నెలవారీ నగదు నిల్వ రూ.2,000 నుంచి రూ.5,000 వరకూ ఉన్న పొదుపు ఖాతాలపై ఈ బ్యాంకు 7 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది.
  • ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: రూ.5లక్షల నుంచి రూ.50లక్షల వరకూ నిల్వ ఉంటే ఈ బ్యాంకు 7 శాతం వడ్డీని ఇస్తోంది.
  • ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: పొదుపు ఖాతాపై ఈ బ్యాంకు 7 శాతం వడ్డీని జమ చేస్తోంది. రూ.10 కోట్లకు మించి నిల్వ ఉన్నప్పుడు వడ్డీ రేటు 6.5శాతం.
  • సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌: ఈ బ్యాంకు తన పొదుపు ఖాతాదార్లకు 6.25శాతం వడ్డీని అందిస్తోంది. నెలవారీ సగటు నిల్వ రూ.2,000 తగ్గకూడదు.
  • వీటితోపాటు కొన్ని నియో బ్యాంకులూ, పేమెంట్స్‌ బ్యాంకులూ పొదుపు ఖాతాపై కాస్త అధిక వడ్డీని అందిస్తున్నాయి. వీటిని ఎంచుకునేటప్పుడు వడ్డీ ఒక్కటే కాకుండా.. నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు, ఏటీఎంలు, శాఖలు తదితరాలనూ పరిగణనలోనికి తీసుకోవాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని