Published : 18 Mar 2022 01:20 IST

డిజిటల్‌ కంపెనీల్లో...

రెండేళ్లుగా ఎన్నో వ్యవస్థలు డిజిటల్‌కు మారిపోయాయి. సంప్రదాయ కంపెనీలు సైతం డిజిటల్‌కు మారేందుకు పెట్టుబడులు కేటాయించాయి. ఎన్నో కొత్తతరం సంస్థలు ఆవిర్భవించాయి. కరోనా నేపథ్యంలో పరిస్థితులు వేగంగా మారినా.. డిజిటలైజేషన్‌ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని చెప్పొచ్చు. డిజిటల్‌ కంపెనీలు ఎంతో దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ సంస్థల్లో మదుపు చేయడం ద్వారా భవిష్యత్‌ లాభాలను అందుకునే వ్యూహంతో వచ్చిన ఫండే టాటా నిఫ్టీ ఇండియా డిజిటల్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈటీఎఫ్‌. నిఫ్టీ ఇండియా డిజిటల్‌ ఇండెక్స్‌ను దీనికి ప్రామాణికం. మార్కెట్‌ క్యాప్‌ పరంగా తొలి 30 కంపెనీలను ఇది ఎంచుకుంటుంది. న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 25తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. గడువు ముగిసిన తర్వాతా స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా క్రయవిక్రయాలకు అవకాశం ఉంది. పాసివ్‌ పెట్టుబడి విధానాన్ని ఇష్టపడేవారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. థీమాటిక్‌ ఫండ్‌ కాబట్టి, కాస్త నష్టభయం ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని