తక్కువ నష్టభయంతో

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తక్కువ నష్టభయం ఉన్న ఇండెక్స్‌ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరే అసెట్‌ నిఫ్టీ ఎస్‌డీఎల్‌ జూన్‌ 2027 ఇండెక్స్‌ ఫండ్‌ పేరుతో వచ్చిన ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ

Published : 25 Mar 2022 00:21 IST

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తక్కువ నష్టభయం ఉన్న ఇండెక్స్‌ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరే అసెట్‌ నిఫ్టీ ఎస్‌డీఎల్‌ జూన్‌ 2027 ఇండెక్స్‌ ఫండ్‌ పేరుతో వచ్చిన ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 29. కనీస పెట్టుబడి రూ.5,000. నిర్ణీత ముగింపు తేదీ వరకూ పెట్టుబడిని కొనసాగించాల్సిన ఈ ఫండ్లు పాసివ్‌ పెట్టుబడి విధానంలో పనిచేస్తాయి. ఇతర ఓపెన్‌ ఎండెడ్‌ డెట్‌ ఫండ్లతో పోలిస్తే ఇవి కాస్త ప్రత్యేకమే. వ్యవధి పూర్తయ్యే వరకూ కొనసాగే వారికి మంచి రాబడినిచ్చే వ్యూహంతో ఇవి ఉంటాయి. ప్రభుత్వ హామీ ఉండే స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌ (ఎస్‌డీఎల్‌)లో ఈ ఫండ్లు పెట్టుబడి పెడతాయి. కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు ఇచ్చే వడ్డీ రేటుతో పోల్చినప్పుడు ఎస్‌డీఎల్‌కు అధిక ప్రతిఫలం అందుతుంది. మదుపరులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వెనక్కి తీసుకోవచ్చు. స్థిరాదాయం అందించే పథకాలతో పోలిస్తే కాస్త అధిక రాబడి అందుకోవాలనుకునే వారు దీన్ని పరిశీలించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని