50 ఏళ్ల వారి కోసం..

ఆరోగ్య బీమా ప్రాధాన్యం పెరగడంతో బీమా సంస్థలు పలు ప్రత్యేక పాలసీలను అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలాయిడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 50 ఏళ్లు పైబడిన వారికోసమే

Published : 25 Mar 2022 00:21 IST

ఆరోగ్య బీమా ప్రాధాన్యం పెరగడంతో బీమా సంస్థలు పలు ప్రత్యేక పాలసీలను అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలాయిడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 50 ఏళ్లు పైబడిన వారికోసమే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ‘స్టార్‌ హెల్త్‌ ప్రీమియర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ’ని వ్యక్తిగతం, ఫ్యామిలీ ఫ్లోటర్‌గానూ తీసుకునే వీలుంది. బీమా తీసుకునే వ్యక్తికి ఏవైన ముందస్తు వ్యాధులు ఉండి, చికిత్స తీసుకుంటున్న సందర్భంలోనే వైద్య పరీక్షల నివేదికలు అడుగుతుంది. ఈ పాలసీకి ప్రీమియాన్ని మూడు, ఆరు నెలలకోసారి చొప్పున వాయిదాల్లోనూ చెల్లించే వీలుంది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వ్యవధికి పాలసీని తీసుకోవచ్చు. ఇంటి వద్ద చేయించుకున్న వైద్యం, ఆయుష్‌ చికిత్స తదితరాలకూ పరిహారం ఇస్తుంది. కనీసం రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకూ ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ఔట్‌ పేషెంట్‌ చికిత్సలకు పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే ఖర్చులు చెల్లిస్తుంది. రెండేళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే రెండో ఏడాది ప్రీమియంలో 10 శాతం, మూడేళ్ల వ్యవధికి తీసుకుంటే రెండు, మూడేళ్ల ప్రీమియంలో 11.25 శాతం రాయితీ లభిస్తుంది. క్లెయిం చేసుకోని పాలసీ ఏడాదికి క్యుములేటివ్‌ బోనస్‌ 20 శాతంతోపాటు, ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకునే ప్రయోజనాన్నీ కల్పిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని