మిడ్‌ క్యాప్‌ సూచీలో..

నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 150 క్వాలిటీ 50 టీఆర్‌ఐని పోలిన రీతిలో యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ నూతన మిడ్‌క్యాప్‌ పథకాన్ని ఆవిష్కరించింది. యూటీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 క్వాలిటీ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు

Published : 01 Apr 2022 00:35 IST

నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 150 క్వాలిటీ 50 టీఆర్‌ఐని పోలిన రీతిలో యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ నూతన మిడ్‌క్యాప్‌ పథకాన్ని ఆవిష్కరించింది. యూటీఐ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 క్వాలిటీ ఇండెక్స్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 5. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.5,000. శర్వాన్‌ కుమార్‌ గోయల్‌ ఫండ్‌ మేనేజర్‌. ఏదైనా మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరులకు ఈ పథకం అనుకూలంగా కనిపిస్తోంది.


నిర్మాణ రంగంలో..

స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాల్లో పరోక్ష పెట్టుబడితో అధిక ప్రతిఫలాన్ని ఆశించే మదుపరులు లక్ష్యంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ హౌసింగ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 11 వరకూ ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకానికి శంకర్‌ నరేన్‌, ఆనంద్‌ శర్మ ఫండ్‌ మేనేజర్లు. క్రమానుగత పెట్టుబడి విధానం, ట్రాన్స్‌ఫర్‌, విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌ఐపీ, ఎస్‌టీపీ, ఎస్‌డబ్లూపీ) సదుపాయాలు ఉన్నాయి. ప్రధానంగా హౌసింగ్‌ థీమ్‌ స్టాక్స్‌లో ఈ ఫండ్‌ పెట్టుబడులు పెడుతుంది. ‘నిఫ్టీ హౌసింగ్‌ ఇండెక్స్‌’ నుంచి షేర్లను ఎంచుకుంటుంది. ఇందులో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, సిమెంటు, స్టీలు, పెయింట్లు, శానిటరీవేర్‌ కంపెనీలు, కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌... తదితర కంపెనీలు ఉన్నాయి. దీర్ఘకాలంలో మదుపరులకు అధిక లాభాలు ఆర్జించటమే లక్ష్యంగా పోర్ట్‌ఫోలియోను ఎంపిక చేసుకొని ఈ పథకాన్ని నిర్వహిస్తారు.


నాస్‌డాక్‌ కంపెనీల్లో..

ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘ఇన్వెస్కో ఈక్యూక్యూక్యూ నాస్‌డాక్‌-100 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే ఓపెన్‌ ఎండెడ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. సమీకరించిన నిధులను ఇన్వెస్కో ఈక్యూక్యూక్యూ నాస్‌డాక్‌-100 యూసీఐటీఎస్‌ ఈటీఎఫ్‌ యూనిట్లలో పెట్టుబడిగా పెడతారు. ఈ పథకాన్ని దాదాపు 19 సంవత్సరాలుగా ఐర్లాండ్‌ నుంచి నిర్వహిస్తున్నారు. దీని కింద రూ.45,873 కోట్ల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఇన్వెస్టో ఈక్యూక్యూక్యూ నాస్‌డాక్‌-100 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 13. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆపిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా, ఆల్ఫాబెట్‌ వంటి అగ్రశ్రేణి ‘నాస్‌డాక్‌- 100’ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ పథకం ద్వారా భారతీయ మదుపరులకు లభిస్తుందని ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని