ప్రమాదానికి గురయ్యా... పాలసీ ఇస్తారా?

వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నాను. నా ఈపీఎఫ్‌ ఖాతాలో రూ.12 లక్షల వరకూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత నెలనెలా పింఛను వచ్చేలా ఎక్కడ మదుపు చేయాలి? వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నాను. నా ఈపీఎఫ్‌ ఖాతాలో రూ.12 లక్షల వరకూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత నెలనెలా పింఛను వచ్చేలా ఎక్కడ మదుపు చేయాలి?

Updated : 01 Apr 2022 06:18 IST

* వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నాను. నా ఈపీఎఫ్‌ ఖాతాలో రూ.12 లక్షల వరకూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత నెలనెలా పింఛను వచ్చేలా ఎక్కడ మదుపు చేయాలి?

- వెంకట్‌

* మీకు వచ్చిన పదవీ విరమణ ప్రయోజనాలు సురక్షితంగా ఉండేలా చూసుకోండి. ఈపీఎఫ్‌ నుంచి వెనక్కి వచ్చిన మొత్తాన్ని పోస్టాఫీసు సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్‌ స్కీంలో జమ చేయండి. ప్రస్తుతం ఈ పథకంలో 7.4శాతం వడ్డీ ఇస్తున్నారు. నెలనెలా కాకుండా.. మూడు నెలలకోసారి వడ్డీ అందుతుంది. అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించవచ్చు. కావాలనుకుంటే మరో మూడేళ్ల వ్యవధిని పెంచుకోవచ్చు.  రూ.12 లక్షలను జమ చేస్తే మూడు నెలలకోసారి రూ.22,200 వడ్డీ వస్తుంది.


* మా అబ్బాయి  అమెరికాలో ఉంటున్నాడు. అతని పేరుమీద ఇక్కడ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు వీలుందా? దీనికోసం ఎలాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది?  

- ఆదిరెడ్డి

* మీ అబ్బాయి ఇక్కడ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు వీలుంది. కానీ, కొన్ని కంపెనీలు మాత్రమే అమెరికాలో ఉండే ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడికి అంగీకరిస్తున్నాయి.  ముందుగా కేవైసీ నిబంధనలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌ఓ బ్యాంకు ఖాతా ద్వారా పెట్టుబడులు ప్రారంభించాలి. అనుమతి ఇస్తున్న సంస్థల వివరాల కోసం డీమ్యాట్‌ ఖాతా ఉన్న స్టాక్‌ బ్రోకర్‌ను సంప్రదించండి.


* మా అమ్మాయి పేరుమీద నెలకు  రూ.15 వేల వరకూ బంగారంలో మదుపు చేయాలని అనుకుంటున్నాం. కనీసం 10 ఏళ్లపాటు దీన్ని కొనసాగిస్తాం. మా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి? 

    - రాము

* మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు మీ పేరుపై తగిన మొత్తానికి టర్మ్‌ పాలసీ తీసుకోండి. మొత్తం పెట్టుబడిని బంగారంలో మదుపు చేయడం సరికాదు. మీరు రూ.3వేల వరకూ పసిడి బాండ్లలో పెట్టుబడి పెట్టండి. మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు కేటాయించండి. ఇలా  చేయడం ద్వారా 10 ఏళ్లలో 11 శాతం రాబడితో రూ.30,09,961 జమ అయ్యేందుకు అవకాశం ఉంది.


* టర్మ్‌ పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. నా వయసు 39 ఏళ్లు. నెలకు రూ.60 వేలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం ప్రమాదానికి గురయ్యాను. ఇప్పుడు కోలుకున్నాను. నేను పాలసీ తీసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయా?

-  భాస్కర్‌

* మీరు కనీసం రూ.70 లక్షల వరకూ టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు కంపెనీలను ఎంచుకొని, రూ.35 లక్షల చొప్పున పాలసీలు తీసుకోండి. దరఖాస్తు పత్రంలో మీకు జరిగిన ప్రమాదం వివరాలు కచ్చితంగా తెలియజేయండి. చికిత్సకు సంబంధించిన పత్రాలనూ సమర్పించాలి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలకూ సిద్ధంగా ఉండాలి. వీటన్నింటినీ పరిశీలించాక బీమా కంపెనీ విచక్షణ మేరకు పాలసీ ఇచ్చే అవకాశం ఉంటుంది.


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని