కరోనా పాలసీలు సెప్టెంబరు వరకూ..

కొవిడ్‌-19 విజృంభిస్తున్న తరుణంలో వచ్చిన కరోనా పాలసీల పునరుద్ధరణ, కొత్తగా తీసుకునేందుకు సెప్టెంబరు 30 వరకూ గడువుంది. కరోనా తగ్గినప్పటికీ ఈ పాలసీలను తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. కరోనా సోకిందని తేలగానే పరిహారం

Published : 15 Apr 2022 01:16 IST

కొవిడ్‌-19 విజృంభిస్తున్న తరుణంలో వచ్చిన కరోనా పాలసీల పునరుద్ధరణ, కొత్తగా తీసుకునేందుకు సెప్టెంబరు 30 వరకూ గడువుంది. కరోనా తగ్గినప్పటికీ ఈ పాలసీలను తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. కరోనా సోకిందని తేలగానే పరిహారం ఇచ్చే కరోనా రక్షక్‌ పాలసీలు అన్ని బీమా సంస్థలూ అందిస్తుండగా, చికిత్సకు ఉపయోగపడే కరోనా కవచ్‌ పాలసీని సాధారణ బీమా సంస్థలు ఇస్తున్నాయి. కరోనా రక్షక్‌ కనీసం రూ.50వేల నుంచి రూ.2.5లక్షల వరకూ తీసుకోవచ్చు. కరోనా కవచ్‌ రూ.50వేల నుంచి గరిష్ఠంగా రూ.5లక్షల వరకూ ఎంచుకోవచ్చు. ఇవి రెండూ స్వల్పకాలిక వ్యవధి పాలసీలే. మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల వ్యవధికి ఈ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ తీసుకున్న తర్వాత 15 రోజుల పాటు వేచి ఉండే వ్యవధి ఉంటుంది. టీకాలు వేయించుకున్నప్పటికీ.. తక్కువ ఖర్చుతో వచ్చే ఈ తరహా పాలసీలు ఉంటే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే మీకున్న ఆరోగ్య బీమా కరోనా చికిత్సకూ వర్తిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని