స్థిరమైన రాబడి వచ్చేలా

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ నుంచి కొత్తగా ఒక ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ పథకం అందుబాటులోకి వచ్చింది ‘హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌ఎంపీ 1469డి ఏప్రిల్‌ 2022’ అనే ఈ రుణ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు

Published : 15 Apr 2022 01:16 IST

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ నుంచి కొత్తగా ఒక ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ పథకం అందుబాటులోకి వచ్చింది ‘హెచ్‌డీఎఫ్‌సీ ఎఫ్‌ఎంపీ 1469డి ఏప్రిల్‌ 2022’ అనే ఈ రుణ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 19. దీనికి వికాస్‌ అగర్వాల్‌ ఫండ్‌ మేనేజర్‌. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడిగా పెట్టాలి. ఎంట్రీ లోడ్‌ లేదు. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. అంటే ఈ పథకం యూనిట్లు కొనుగోలు చేసిన మదుపరులు పథకం ముగిసే వరకూ తమ పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద సేకరించిన నిధులను రుణ, మనీ మార్కెట్‌ పత్రాల్లో పెట్టుబడిగా పెడతారు. ప్రభుత్వ బాండ్లపై లభిస్తున్న వడ్డీ రేటుకు అనుగుణంగా ఇటువంటి పథకాల్లో ప్రతిఫలం లభిస్తుంది. రిస్కు దాదాపుగా ఉండదు. బ్యాంకు డిపాజిట్లలో సొమ్ము పెట్టాలనుకునే మదుపరులు ప్రత్యామ్నాయంగా ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని