నగదు రహిత ఓపీడీ సేవల కోసం..
ఆసుపత్రిలో చేరినప్పుడే కాకుండా.. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) చికిత్సలకూ నగదు రహిత సేవలను అందించే కొత్త పాలసీని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. ఈ ‘మణిపాల్ సిగ్నా
ఆసుపత్రిలో చేరినప్పుడే కాకుండా.. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) చికిత్సలకూ నగదు రహిత సేవలను అందించే కొత్త పాలసీని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. ఈ ‘మణిపాల్ సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్’ పాలసీలో వైద్యేతర ఖర్చులకూ పరిహారం లభిస్తుంది. వైద్యుల సంప్రదింపులు, వైద్య పరీక్షలు, ఔషధాలు తదితరాలను ఈ పాలసీ చెల్లిస్తుంది. ఆసుపత్రిలో చేరినప్పుడు పాలసీదారుడు తాను ఏ గదిలో ఉండాలన్నదీ నిర్ణయించుకోవచ్చు. విదేశాలకు వెళ్లేవారు.. 30 రోజుల వరకూ పాలసీని ‘స్విచ్ ఆఫ్’ చేసుకునే వెసులుబాటునూ అందిస్తోంది. పాలసీ మొత్తం పూర్తయిన వెంటనే.. తిరిగి భర్తీ చేసుకునే రిస్టోర్ వెసులుబాటునూ ప్రోహెల్త్ ప్రైమ్ అందిస్తోంది. దీనికి ఎలాంటి పరిమితీ లేదు. ప్రసూతి ఖర్చులకూ బీమా వర్తిస్తుంది. దీంతోపాటు ఐవీఎఫ్/ఐయూఐ చికిత్సలకూ ఈ బీమా ఖర్చులను చెల్లిస్తుంది. ఎయిర్ అంబులెన్స్ సేవలకూ గరిష్ఠంగా రూ.10లక్షల వరకూ ఖర్చులను ఇస్తుంది. మొత్తం మూడు రకాలుగా ఈ పాలసీ అందుబాటులో ఉంది. ప్రోహెల్త్ ప్రైమ్ ప్రొటెక్ట్ పూర్తి స్థాయి ఆరోగ్య బీమా. ప్రైమ్ అడ్వాంటేజ్ ఎంచుకున్న వారికి ఆసుపత్రి వ్యయాలతోపాటు ఓపీడీ ఖర్చులనూ చెల్లిస్తుంది. ముందస్తు వ్యాధులు అంటే.. మధుమేహం, అధిక రక్తపోటులాంటివి ఉన్నవారికి ప్రోహెల్త్ ప్రైమ్ ఆక్టివ్ పేరుతో అందిస్తోంది. వార్షిక ఆరోగ్య పరీక్షలకూ ఈ పాలసీ అనుమతినిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..