మూడేళ్లకు మించితే నోటీసులు వద్దు

 పన్ను వర్తించే ఆదాయం రూ.50లక్షల లోపు ఉన్న వారు దాఖలు చేసిన రిటర్నులను పనః పరిశీలన చేసేందుకు (రీఅసెస్‌మెంట్‌) నోటీసులను జారీ చేసేందుకు మూడేళ్ల కాలాన్నే పరిగణనలోకి తీసుకోవాలని

Published : 13 May 2022 04:52 IST

 పన్ను వర్తించే ఆదాయం రూ.50లక్షల లోపు ఉన్న వారు దాఖలు చేసిన రిటర్నులను పనః పరిశీలన చేసేందుకు (రీఅసెస్‌మెంట్‌) నోటీసులను జారీ చేసేందుకు మూడేళ్ల కాలాన్నే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదాయపు పన్ను అధికారులకు సూచించింది. 

2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు గాను రిటర్నులకు రీఅసెస్‌మెంట్‌ నోటీసులను జారీ చేయొద్దని తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2015-16 తర్వాత నుంచి దాఖలు చేసిన రిటర్నులకు మాత్రమే నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 2021-22 బడ్జెట్‌లో ఐటీ రీఅసెస్‌మెంట్‌ను ఆరేళ్ల నుంచి మూడేళ్లకు ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ ఐటీ శాఖ ఆరేళ్ల వ్యవధికి కొంతమందికి నోటీసులు జారీ చేసింది. వీటిపై పలు కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. వీటిని అన్నింటినీ కొట్టివేయాలని ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం ఆయా నోటీసులను అనుమతిస్తూ ఐటీ విభాగానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మూడేళ్ల పరిమితికే నోటీసులను జారీ చేయాలని సీబీడీటీ నోటిఫికేషన్‌ ఇవ్వడం చాలామందికి ఊరట కలిగించే అంశం. అనుమానం ఉన్న రిటర్నుల రీఅసెస్‌మెంట్‌ కోసం నోటీసులు పంపి, సమాధానం కోసం 30 రోజుల గడువు ఇస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని