
వైద్యుల కోసం పాలసీ...
వృత్తిపరంగా పొరపాట్లు జరిగినప్పుడు వైద్యులకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. కొన్నిసార్లు నష్టపరిహారం సైతం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వారికి ధీమానిచ్చేలా ఐసీఐసీఐ లాంబార్డ్ డాక్టర్ల కోసం ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల స్పెషలైజేషన్లకూ ఇది వర్తిస్తుంది. వేగంగా పాలసీని జారీ చేయడంతోపాటు, పూర్తిగా పారదర్శకంగా ఉండేలా దీన్ని తీసుకొచ్చినట్లు బీమా సంస్థ వెల్లడించింది. క్లెయింల సందర్భంలో వైద్యులకు అవసరమైన న్యాయ సేవలనూ ఇందులో భాగంగా అందిస్తారు. కొన్నిసార్లు ఎలాంటి పొరపాటూ లేకపోయినా క్లెయింలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనూ ఈ పాలసీ అవసరమైన న్యాయ, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పాలసీని ఎస్ఎంఈ విభాగం కింద అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఏజెంట్లు లేదా ఆన్లైన్లో ఈ పాలసీని తీసుకునేందుకు వీలుంది.
రిటర్నులు దాఖలు చేయలేదా?
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారికి అధిక మొత్తంలో టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) విధించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం (మదింపు సంవత్సరం 2021-22)కు సంబంధించిన రిటర్నులు దాఖలు చేయని వారిని ‘స్పెసిఫైడ్ పర్సన్’గా ఆదాయపు పన్ను విభాగం గుర్తించింది. వీరికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో టీడీఎస్ విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించి టీడీఎస్ ఉన్నవారు రిటర్నులు దాఖలు చేయకపోతేనే ఈ నిబంధన వర్తిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించిన రిటర్నులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసినవారిని ఈ జాబితాలో నుంచి తొలగిస్తారు. అధిక టీడీఎస్ వసూలు కోసం ప్రత్యేకంగా సెక్షన్ 206ఏబీని, సెక్షన్ 206సీసీఏని టీసీఎస్ కోసం తీసుకొచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Karnataka: మీరు సక్రమంగా పనిచేయాలంటే ప్రధాని, రాష్ట్రపతి తరచూ పర్యటించాలా?: హైకోర్టు
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి.. భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు
-
Movies News
Karthikeya 2: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే భయమేసేది: నిఖిల్
-
Business News
Pulsar 250: మార్కెట్లోకి కొత్త పల్సర్ 250.. బ్లాక్ ప్రియుల కోసం ప్రత్యేకం!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
- Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- Andhra News: అయ్యో పాపం.. బైక్‌పై వెళ్తుండగా అన్నదమ్ముల సజీవదహనం
- Shamshera: బాహుబలి, కేజీఎఫ్‌లను తలపించేలా ‘షంషేరా’ ట్రైలర్!