Updated : 27 May 2022 00:55 IST

పెరిగిన థర్డ్‌ పార్టీ ప్రీమియం

మోటార్‌ వాహనాల థర్డ్‌ పార్టీ బీమా పాలసీల ప్రీమియం పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పెంపు జూన్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. సాధారణంగా ఏటా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం రేట్లను సవరిస్తూ ఉంటుంది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రీమియాన్ని మార్చలేదు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం..

ప్రైవేటు కార్లకు థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం

1000 సీసీ ఇంజిన్‌ ఉంటే రూ.2,094 (పెంపు రూ.22)

1000-1500సీసీ ఇంజిన్‌ ఉన్నప్పుడు రూ.3,416 అయ్యింది. (పెంపు రూ.195)

1500 సీసీ మించి సామర్థ్యం ఉన్న కార్ల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం రూ.7,897 (పెంపు రూ.7)

30 కిలోవాట్లకంటే తక్కువ ఉన్న విద్యుత్‌ కార్లకు ప్రీమియం రూ.1,780గా నిర్ణయించింది. 30 -60 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న కార్ల ప్రీమియం రూ.2,904.

ద్విచక్ర వాహనాలకు..

150 -350 సీసీ వరకూ థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం రూ.1,366గా ఉండనుంది.

350 సీసీని మించిన వాటికి ప్రీమియం రూ.2,804.

వాణిజ్య వాహనాలకు..

12000 కేజీల నుంచి 20వేల కేజీల సామర్థ్యం ఉన్న కమర్షియల్‌ వాహనాలకు థర్డ్‌పార్టీ బీమా రూ.35,313.

40వేల కేజీల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటికి రూ.44,242 ప్రీమియం చెల్లించాలి.

విద్యా సంస్థలు ఉపయోగించే బస్సులకు ప్రీమియంపైన 15 శాతం, హైబ్రీడ్‌ విద్యుత్‌ వాహనాలపై 7.5 శాతం రాయితీని ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts