Updated : 03 Jun 2022 06:16 IST

ఆరోగ్య బీమా.. రూ. కోటి వరకూ

పాలసీదారుడి అవసరాల మేరకు ఆరోగ్య బీమాను ఎంచుకునే విధంగా రిలయన్స్‌ హెల్త్‌ గెయిన్‌ పాలసీని తీసుకొచ్చింది రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌. ఇలా ఎంపిక చేసుకున్న అంశాల ఆధారంగానే ప్రీమియం నిర్ణయించడం ఈ పాలసీ ప్రత్యేకత. ఇందులో ప్లస్, పవర్, ప్రైమ్‌ పేరుతో మూడు రకాలుగా ఈ పాలసీని అందిస్తోంది. ఒకే క్లెయింపై రెండుసార్లు కవర్, హామీతో కూడిన క్యుములేటివ్‌ బోనస్‌లాంటివి ఉన్నాయి. ముందస్తు వ్యాధుల నిరీక్షణ వ్యవధిని మూడేళ్ల నుంచి 2 లేదా ఏడాదికి తగ్గించింది. అవసరాన్ని బట్టి, రూ.3లక్షల నుంచి రూ. కోటి వరకూ విలువైన పాలసీని ఎంచుకునే వీలుంది. రూ.3 లక్షల పాలసీని ఎంచుకునేందుకు ఎలాంటి వయో పరిమితి లేదు. కాబట్టి, ఇప్పటివరకూ ఎలాంటి పాలసీ లేని సీనియర్‌ సిటిజన్లు హెల్త్‌ గెయిన్‌ను పరిశీలించవచ్చు. దగ్గరి కుటుంబ సభ్యులు 12 మంది వరకూ ఒకే పాలసీ కింద రక్షణ పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళలు పాలసీ తీసుకున్నప్పుడు లేదా ప్రపోజర్‌గా ఉన్నప్పుడు ప్రీమియంలో 5శాతం తగ్గింపు వర్తిస్తుంది. ఏడాది, రెండు, మూడేళ్ల వ్యవధికీ పాలసీని తీసుకునే అవకాశం ఉంది. ​​​​​​


ధీమా.. 100 ఏళ్ల వరకూ..

జీవితాంతం వరకూ బీమా రక్షణ కల్పించడంతోపాటు, క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే విధంగా టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. ‘స్మార్ట్‌ వాల్యూ ఇన్‌కం ప్లాన్‌’ను విడుదల చేసింది. ప్రీమియం చెల్లించిన మొదటి నెల నుంచే ఈ పాలసీ నగదు బోనస్‌ను అందిస్తుంది. పాలసీదారుడు ఎప్పుడైనా ప్రీమియం చెల్లించలేని పరిస్థితుల్లో క్యాష్‌ బోనస్‌లను సర్దుబాటు చేసుకొని, ప్రీమియం చెల్లించే ఏర్పాటూ ఈ పాలసీలో ఉంది. వచ్చిన బోనస్‌ను వెంటనే తిరిగి తీసుకోకుండా.. సబ్‌ వ్యాలెట్‌లో జమ చేసుకోవచ్చు. దీని ద్వారా లాయల్టీ అడిషన్‌ సైతం పాలసీకి జమ అవుతుంది. అవసరమైనప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకొనే అవకాశాన్ని పాలసీ కల్పిస్తోంది. లేదా ప్రీమియం చెల్లింపు కోసం వాడుకోవచ్చు. ఆదాయం కోల్పోయినప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో లైఫ్‌ కవర్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా లైఫ్‌ ప్రొటెక్ట్‌ సదుపాయం కల్పిస్తుంది. వరుసగా ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పాలసీ పెయిడప్‌గా మారినా.. క్యాష్‌ బోనస్‌లు కొనసాగుతూనే ఉంటాయి. మహిళా పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈలు నిర్వహించేవారు.. పాలసీ నుంచి రుణం తీసుకునే అవకాశం ఉంది. వీరికి వడ్డీ రేటులో 1 శాతం వరకూ రాయితీ లభిస్తుంది. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని