పెరిగిన వడ్డీ రేట్లు..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో.. దీనికి అనుసంధానించిన రుణాల రేట్లూ పెరగడం ప్రారంభమయ్యాయి. సాధారణంగా రెపో రేటు పెరిగిన వెంటనే ఆ మేరకు బ్యాంకులు తమ ఎక్స్‌టర్నల్‌

Updated : 10 Jun 2022 07:10 IST

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో.. దీనికి అనుసంధానించిన రుణాల రేట్లూ పెరగడం ప్రారంభమయ్యాయి. సాధారణంగా రెపో రేటు పెరిగిన వెంటనే ఆ మేరకు బ్యాంకులు తమ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెడింగ్‌ రేటు(ఈబీఎల్‌ఆర్‌)ను సవరిస్తుంటాయి. 

* ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు (ఈబీఎల్‌ఆర్‌)ను 50 బేసిస్‌ పాయింట్లు పెంచి, 8.60 శాతానికి చేర్చింది.
* ఇండియన్‌ బ్యాంక్‌ రెపో ఆధారిత రుణాల రేటును 7.70 శాతంగా  ప్రకటించింది.
* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును 7.40 శాతం చేసింది.
* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 6.90శాతం నుంచి 7.40 శాతానికి పెంచింది.
* కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వడ్డీ రేటు ఇక నుంచి 7.95% ఉండనుంది.
* ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును 10 శాతంగా నిర్ణయించింది.
* సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో బేస్డ్‌ లెండింగ్‌ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ఈ బ్యాంకు రుణాల వడ్డీ రేటు ఇప్పుడున్న 7.25 శాతం నుంచి 7.75 శాతానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు