విద్యార్థుల కోసం క్యాంపస్‌ పవర్‌

మన దేశంతోపాటు, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘క్యాంపస్‌ పవర్‌’ పేరుతో డిజిటల్‌ వేదికను ప్రారంభించింది. దీనిద్వారా విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలకు అవసరమైన అన్ని బ్యాంకింగ్‌ సేవలనూ

Updated : 24 Jun 2022 04:40 IST

మన దేశంతోపాటు, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘క్యాంపస్‌ పవర్‌’ పేరుతో డిజిటల్‌ వేదికను ప్రారంభించింది. దీనిద్వారా విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలకు అవసరమైన అన్ని బ్యాంకింగ్‌ సేవలనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకింగ్‌తో పాటు.. విలువ ఆధారిత సేవలనూ ఒకేచోట పొందేందుకు వీలవుతుంది. అన్ని అవసరాలకూ ఒకే చోట పరిష్కారం చూపడమే దీని ప్రధాన లక్ష్యం అని బ్యాంక్‌ పేర్కొంది. ఐసీఐసీఐ ఖాతాదారులతోపాటు, ఇతర బ్యాంకు వినియోగదారులకూ ‘క్యాంపస్‌ పవర్‌’ అందుబాటులో ఉంటుందని తెలిపింది. విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా పొదుపు ఖాతాలు, ఓవర్సీస్‌ ఖాతాలు, విద్యా రుణాలు, పన్ను ప్రయోజనాలు, విదేశీ మారక ద్రవ్యం, కార్డులు, ఇతర రుణాలకు సంబంధించిన సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. భారత్‌తోపాటు అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్న విద్యా సంస్థల సమాచారం, కోర్సుల వివరాలనూ ఒకేచోట తెలుసుకునే ఏర్పాట్లున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ అన్‌సెక్యూర్డ్‌ అసెట్స్‌ హెడ్‌ సుదీప్త రాయ్‌ వెల్లడించారు. తల్లిదండ్రులకు విద్యా రుణాలు, విదేశీ కరెన్సీ కొనుగోలు తదితర అంశాల్లో సేవలు లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు