విద్యారుణంపై ప‌న్ను మిన‌హాయింపు పొందండిలా!

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80ఈ కింద విద్యారుణం పై చెల్లించే వ‌డ్డీ పై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. విద్య‌కు అయ్యే ఖ‌ర్చులు పెరుగుపోతున్నాయి. మాస్ట‌ర్స్ లేదా మేనేజ్‌మెంట్ డిప్ల‌మా కొన్ని పేరుపొందిన క‌ళాశాల‌నుంచి చేసేందుకు సుమారు రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కూ

Published : 16 Dec 2020 19:41 IST

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80ఈ కింద విద్యారుణం పై చెల్లించే వ‌డ్డీ పై మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. విద్య‌కు అయ్యే ఖ‌ర్చులు పెరుగుపోతున్నాయి. మాస్ట‌ర్స్ లేదా మేనేజ్‌మెంట్ డిప్ల‌మా కొన్ని పేరుపొందిన క‌ళాశాల‌నుంచి చేసేందుకు సుమారు రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు అవుతుంది. అదే ప్రైవేట్ మెడిక‌ల్ సీట్ కొనాలంటే రూ. 50 ల‌క్ష‌లు చెల్లించాలి. ఈ కోర్సుల‌కు చెల్లించే ఫీజుల‌తో పాటు ఇత‌ర ఖ‌ర్చులు చాలానే ఉంటాయి. ఉన్న‌త విద్య‌కు రుణం తీసుకోవ‌డం ద్వారా విద్యార్థులు తాము కోరుకున్న చ‌దువును కొన‌సాగించ‌వ‌చ్చు. ఎడ్యుకేష‌న‌ల్ లోన్ ద్వారా క‌లిగే ప్ర‌ధాన ఉప‌యోగం ఏంటంటే త‌ల్లిదండ్రులు వ‌ద్ద డ‌బ్బు లేన‌పుడు విద్యార్థ‌లులు సొంతంగా రుణాన్ని తీసుకుని చ‌దువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన త‌రువాత చెల్లించే అవ‌కాశం ఉంటుంది. దీంతో పాటు చెల్లించే వ‌డ్డీ మొత్తంపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

విద్యారుణం ఎవ‌రు తీసుకోవ‌చ్చు?

ఎవ‌రైన విద్యార్థి త‌న ఉన్న‌త విద్య‌కు అవ‌స‌ర‌మ‌య్యే డ‌బ్బును స‌మ‌కూర్చుకోవ‌డానిరి విద్యారుణం పొంద‌వ‌చ్చు. ఇది ప్ర‌భుత్వ గుర్తింపుపొందిన లేదా అథీకృత సంస్థ‌లు భార‌త్ లో లేదా విదేశాల్లో ఉండే వాటికి రుణం ల‌భిస్తుంది. దీనికి విద్యార్థి త‌న‌ ఉన్న‌త సెకండ‌రీ విద్య పూర్తియ్యాక ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.ఈ రుణం బ్యాంకులు లేదా ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల నుంచి తీసుకోవ‌చ్చు. గుర్తింపు పొందిన‌ చారిట‌బుల్ సంస్థ నుంచి (ఆదాయ‌పు ప‌న్నుచ‌ట్టం10(23C) లేదా 80G (2)(a) కింద )ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. బంధువులు, స్నేహితుల నుంచి తీసుకునే రుణాల‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌దు.

ప‌న్ను మిన‌హాయింపును క్ల‌యిమ్ ఎవ‌రు చేసుకోవ‌చ్చు?

విద్యారుణంలో తీసుకున్న అస‌లు పై ప‌న్నుమిన‌హాయింపు వ‌ర్తించ‌దు. కానీ రుణంపై చెల్లించే వ‌డ్డీ మొత్తానికి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఈ ప‌న్ను మిన‌హాయింపును తిరిగి చెల్లించ‌డం ప్రారంభించిన సంవ‌త్స‌రం నుంచి వ‌రుస‌గా 8 ఏళ్ల పాటు వ‌ర్తిస్తుంది. మీరు రుణం తీసుకున్న బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ నుంచి రుణాన్ని చెల్లించిన‌ట్టుగా ప్ర‌తీ సంవ‌త్స‌రం ధ్రువ‌ప‌త్రాన్ని తీసుకోవాలి.

త‌ల్లిదండ్లులు తమ అమ్మాయి చ‌దువు కోసం విద్యారుణం తీసుకుంటే, ఈఎమ్ఐలు వారు చెల్లించాలి.అప్పుడు ప‌న్ను మిన‌హాయింపు క్ల‌యిమ్ వారు చేసుకోవాల్సి ఉంటుంది. వారి అమ్మాయి చ‌దువు పూర్త‌యిన త‌రువాత త‌న ఆదాయం నుంచి రుణ చెల్లింపులు చేస్తే అటు వారి త‌ల్లిదండ్రుల‌కు, ఇటు అమ్మాయికి ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌దు. అదే విధంగా రుణం పాప‌ పేరున తీసుకుని చెల్లింపులు త‌మ త‌ల్లిదండ్రుల ఆదాయంతో చెల్లిస్తే ప‌న్నుమిన‌హాయింపు వ‌ర్తించ‌దు. చాలా సంద‌ర్భాల్లో ఈఎమ్ఐ మొత్తాన్ని త‌ల్లిదండ్ర‌లు, పిల్లలు క‌లిపి చెల్లించడం జ‌రుగుతుంది. ఆ సంద‌ర్భాల్లో త‌మ అమ్మాయి చెల్లించిన ఈఎమ్ఐ లో వ‌డ్డీ భాగానికి మాత్రమే ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది త‌ల్లిదండ్లులు చెల్లించిన భాగానికి ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని