ఇవి కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని తెలుసా?

క్రెడిట్ స్కోరు రుణగ్రహీత క్రెడిట్ విలువను సూచిస్తుంది. రుణదాతల నుంచి సేకరించిన స‌మ‌చారం ఆధారంగా క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్‌ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో త‌క్కువ రేట్ల‌తో రుణం పొందే అవకాశాలు ఎక్కువ. తక్కువ క్రెడిట్ స్కోరు

Published : 16 Dec 2020 19:51 IST

క్రెడిట్ స్కోరు రుణగ్రహీత క్రెడిట్ విలువను సూచిస్తుంది. రుణదాతల నుంచి సేకరించిన స‌మ‌చారం ఆధారంగా క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్‌ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో త‌క్కువ రేట్ల‌తో రుణం పొందే అవకాశాలు ఎక్కువ. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న రుణగ్రహీతలు అధిక రుణం ఉన్నవారు క్ర‌మంగా రుణాన్ని చెల్లించ‌క‌పోతే, బ్యాంకులు తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చే అవకాశం ఉంది, దీంతో పాటు అధిక వడ్డీ రేట్లు వసూలు చేయవచ్చు.

అందువల్ల, మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాల‌ గురించి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. రుణం లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అంద‌రికీ అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంటుంది. అవి ఏంటంటే…వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి.

కుటుంబ సభ్యులకు, బందువుల‌కు హామీదారుగా ఉండ‌టం సాధారణం. అయితే ఇలా తరచుగా చేయ‌డం వ‌ల‌న త‌మ క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌నే అవ‌గాహ‌న చాలామందికి ఉండ‌దు. ఇలా చేస్తే కొత్త‌ రుణాల కోసం మీ సొంత‌ అర్హత తగ్గడమే కాదు, అసలు రుణగ్రహీతకు బ‌కాయిలు ఉన్న‌ట్ల‌యితే మీరు కూడా నష్టపోవచ్చు.

కొనసాగుతున్న నగదు సంక్షోభం కారణంగా, కొంతమంది రుణగ్రహీతలు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను అందించమని కోరిన రుణ పునర్నిర్మాణ ఎంపిక కోసం వెళ్ళడం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు, సెప్టెంబరులో తాత్కాలిక నిషేధం(మార‌టోరియం) ముగిసింది. ఇది తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు, కాని ఈ రుణాలు క్రెడిట్ బ్యూరోలకు ‘పునర్నిర్మించబడినవి’ (రీస్ర్ట‌క్చ‌ర్‌) గా నివేదించ‌డం మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని