ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల వారికి శుభ‌వార్త‌!

త‌క్కువ ఆదాయం, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల వారి సొంతింటి క‌ల నెర‌వేర్చేందుకు కేంద్ర ప్రభుత్వ మంచి అవ‌కాశం క‌ల్పించింది. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌నా కింద ఈ వ‌ర్గాల వారు ఇల్లు క‌ట్టుకునేందుకు/కొనేందుకు లేదా తిరిగి కొనుగోలు చేసేందుకు కూడా గృహ రుణ వ‌డ్డీల‌పై స‌బ్సిడీల‌ను ఇస్తారు.

Published : 17 Dec 2020 19:46 IST

త‌క్కువ ఆదాయం, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల వారి సొంతింటి క‌ల నెర‌వేర్చేందుకు కేంద్ర ప్రభుత్వ మంచి అవ‌కాశం క‌ల్పించింది. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌నా కింద ఈ వ‌ర్గాల వారు ఇల్లు క‌ట్టుకునేందుకు/కొనేందుకు లేదా తిరిగి కొనుగోలు చేసేందుకు కూడా గృహ రుణ వ‌డ్డీల‌పై స‌బ్సిడీల‌ను ఇస్తారు. ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల(ఈడ‌బ్ల్యూఎస్‌) వారి ఆదాయం ఏటా రూ.3 ల‌క్ష‌ల‌లోపు ఉంటుంది. అలాగే త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) వారి వార్షికాదాయం రూ.3 నుంచి రూ.6 ల‌క్ష‌ల‌లోపు ఉంటుంది.

అందుబాటు ధ‌ర‌లో ఇల్లు కొనేవారికి కొన్ని ష‌ర‌తులు
ఈ స‌బ్సిడీని పొందేందుకు ల‌బ్ధిదారుని కుటుంబం ఇది వ‌ర‌కే ప‌క్కా ఇంటిని సొంతం చేసుకొని ఉండ‌రాదు. ముఖ్యంగా కుటుంబ‌స‌భ్యుల పేరిట మ‌న దేశంలో ఎక్క‌డా ప‌క్కా ఇల్లు ఉండ‌కూడ‌దు. 
ఈ ప‌థ‌కం కింద ఇంటి రుణాన్ని ఒక రుణ సంస్థ నుంచి పొంది మ‌రొక రుణ‌ సంస్థ‌కు మార్చుకుంటే గ‌నుక స‌ద‌రు వ్య‌క్తి స‌బ్సిడీ పొందేందుకు అర్హత కోల్పోతాడు.

ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాలు(ఈడ‌బ్ల్యూఎస్‌)
వీరి వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 ల‌క్ష‌ల‌లోపు ఉన్న‌వారు రూ.6 ల‌క్ష‌ల గృహ‌రుణ వ‌డ్డీపై 6.5 శాతం స‌బ్సిడీకి అర్హులు. రుణ కాల‌ప‌రిమితి మొత్తానికి లేదా గ‌రిష్టంగా 20ఏళ్ల‌కు… వీటిలో ఏది త‌క్కువైతే ఆ కాలావ‌ధికి స‌బ్సిడీ ప్ర‌యోజ‌నం వ‌ర్తిస్తుంది. 30 చ‌ద‌ర‌పు మీట‌ర్లు లేదా 323 చ‌ద‌ర‌పు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలి. రూ.6 ల‌క్ష‌ల పైన అద‌నంగా ఉండే రుణానికి స‌బ్సిడీ వ‌ర్తించ‌దు. ఆ లోపు దానికి మాత్రం స‌బ్సిడీ వ‌ర్తిస్తుంది.

త‌క్కువ ఆదాయం గ‌ల(ఎల్ఐజీ) వ‌ర్గం
వార్షిక కుటుంబ ఆదాయం రూ.3-6 ల‌క్ష‌ల మ‌ధ్య ఉన్న‌వారు రూ.6 ల‌క్ష‌ల గృహ‌రుణ వ‌డ్డీపై 6.5 శాతం స‌బ్సిడీకి అర్హులు. రుణ కాల‌ప‌రిమితి మొత్తానికి లేదా గ‌రిష్టంగా 20ఏళ్ల‌కు… వీటిలో ఏది త‌క్కువైతే ఆ కాలావ‌ధికి స‌బ్సిడీ ప్ర‌యోజ‌నం వ‌ర్తిస్తుంది. 60 చ‌ద‌ర‌పు మీట‌ర్లు లేదా 646 చ‌ద‌ర‌పు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలి. రూ.6 ల‌క్ష‌ల పైన అద‌నంగా ఉండే రుణానికి స‌బ్సిడీ వ‌ర్తించ‌దు.

ఎలా ప‌నిచేస్తుంది

ఉదాహ‌ర‌ణ‌-1
కుమార్ అనే వ్య‌క్తి రూ.3 ల‌క్ష‌ల రుణాన్ని 10 శాతం వార్షిక వ‌డ్డీకి 20ఏళ్ల కాల‌ప‌రిమితితో తీసుకున్నాడనుకుందాం. ఈ రుణంపై ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న స‌బ్సిడీ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌లేదు. అప్పుడు అత‌డు చెల్లించే నెల‌వారీ వాయిదా రూ.2895 గా ఉంటోంది. 
ఇప్పుడు ఆవాస్ యోజ‌న గురించి తెలుసుకున్నాక‌… దాని ద్వారా 6.5 శాతం సబ్సిడీ పొందాడు. ప్ర‌స్తుత నిక‌ర విలువ‌(ఎన్‌పీవీ)ని 9శాతంగా భావిస్తే మొత్తం రూ.1,33,640 అవుతుంది. ఈ త‌గ్గింపును రుణ మొత్తంలోంచి తీసివేస్తే గృహ‌రుణం రూ.1,66,360 అవుతుంది. (3,00,000 - 1,33,640= 1,66,360) . దీనికి ఈఎమ్ఐగా రూ.1605 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెల‌కు రూ.1,290 ఆదా అవుతుంది.

ఉదాహ‌ర‌ణ‌-2
ర‌వి రూ.6 ల‌క్ష‌ల రుణాన్ని 10శాతం వార్షిక వ‌డ్డీకి 20ఏళ్ల కాల‌ప‌రిమితితో తీసుకున్నాడనుకుందాం. ఈ రుణంపై ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న స‌బ్సిడీ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌లేదు. అప్పుడు అత‌డు చెల్లించే నెల‌వారీ వాయిదా రూ.5790 గా ఉంటోంది. 
పీఎమ్ఏవై స‌బ్సిడీ గురించి తెలిసాక‌…రుణంపై అత‌డు 6.5 శాతం వ‌డ్డీపై స‌బ్సిడీ పొందాడు. ప్ర‌స్తుత నిక‌ర విలువ‌(ఎన్‌పీవీ)ని 9శాతంగా భావిస్తే మొత్తం రూ.2,67,280 అవుతుంది. ఈ త‌గ్గింపును రుణ మొత్తంలోంచి తీసివేస్తే గృహ‌రుణం రూ.3,32,720 అవుతుంది. (6,00,000 - 2,67,280= 3,32,720) . దీనికి ఈఎమ్ఐగా రూ.3211 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెల‌కు రూ.2579 ఆదా అవుతుంది.

ఉద‌హ‌ర‌ణ‌-3
రాజు రూ.10 ల‌క్ష‌ల రుణాన్ని 10శాతం వార్షిక వ‌డ్డీకి 20ఏళ్ల కాల‌ప‌రిమితితో తీసుకున్నాడనుకుందాం. ఈ రుణంపై ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న స‌బ్సిడీ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌లేదు. అప్పుడు అత‌డు చెల్లించే నెల‌వారీ వాయిదా రూ.9650 గా ఉంటోంది. 
పీఎమ్ఏవై స‌బ్సిడీ గురించి తెలిసాక‌…తీసుకున్న రుణంలో అత‌డు గ‌రిష్టంగా రూ.6 ల‌క్ష‌ల పై 6.5 శాతం వ‌డ్డీపై స‌బ్సిడీ పొందాడు. ప్ర‌స్తుత నిక‌ర విలువ‌(ఎన్‌పీవీ)ని 9శాతంగా భావిస్తే మొత్తం రూ.2,67,280 అవుతుంది. ఈ త‌గ్గింపును రుణ మొత్తంలోంచి తీసివేస్తే గృహ‌రుణం రూ.7,32,720 అవుతుంది. (10,00,000 - 2,67,280= 7,32,720) . దీనికి ఈఎమ్ఐగా రూ.7071 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెల‌కు రూ.2579 ఆదా అవుతుంది.

స‌బ్సిడీ ద్వారా నెల‌కు మిగిలే సొమ్మును ఈక్విటీ ఆధారిత‌ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో 20ఏళ్ల పాటు సిప్ చేసిన‌ట్ల‌యితే మొత్తం వ‌డ్డీ సొమ్మును ప‌రిహ‌రించుకోవ‌చ్చు. దీంతోపాటు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ అస‌లు (ప్రిన్సిప‌ల్ సొమ్ము)పై ప‌న్ను మిన‌హాయింపు ఉంది. ఇది కాకుండా సెక్ష‌న్ 24 బి కింద అద‌నంగా రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు పన్ను మిన‌హాయింపు పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని