పిల్ల‌ల ఉన్న‌త విద్య‌కు ప్ర‌ణాళిక‌

భ‌విష్య‌త్తు కోసం పెట్టుబ‌డులు పెట్టేవారికి దీర్ఘ‌కాలిక ఆర్థిక ల‌క్ష్యాల‌లో పిల్ల‌ల ఉన్న‌త విద్య త‌ప్ప‌క ఉంటుంది. చాలా మంది త‌ల్లిదండ్ర‌లు త‌మ పిల్ల‌లను ఉన్న‌త విద్య కోసం విదేశాల‌కు పంపించాల‌ని కోరుకుంటారు. అలాంట‌ప్పుడు ఎంత త్వర‌గా ప్ర‌ణాళిక వేసుకుంటే అంత మంచిది. మీరు అనుకున్న

Published : 17 Dec 2020 22:09 IST

భ‌విష్య‌త్తు కోసం పెట్టుబ‌డులు పెట్టేవారికి దీర్ఘ‌కాలిక ఆర్థిక ల‌క్ష్యాల‌లో పిల్ల‌ల ఉన్న‌త విద్య త‌ప్ప‌క ఉంటుంది. చాలా మంది త‌ల్లిదండ్ర‌లు త‌మ పిల్ల‌లను ఉన్న‌త విద్య కోసం విదేశాల‌కు పంపించాల‌ని కోరుకుంటారు. అలాంట‌ప్పుడు ఎంత త్వర‌గా ప్ర‌ణాళిక వేసుకుంటే అంత మంచిది. మీరు అనుకున్న ల‌క్ష్యానికి చేరేందుకు క‌నీసం 10-15 సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుంది. విదేశాల్లో చ‌దువులకు ఈరోజుల్లో క‌నీసం రూ.40 ల‌క్ష‌ల కంటే పైనే ఖ‌ర్చు అవుతుంది. మరి దీనికోసం ఏం చేస్తున్నారు. చ‌ద‌వాల‌నుకుంటున్న కోర్సుకు ఎంత ఖ‌ర్చ‌వుతుంద‌న్న‌ది భ‌విష్య‌త్తు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌లిపి అంచ‌నా వేయాలి. మ‌రి ఈ ల‌క్ష్యాల కోసం ప్ర‌స్తుతం ఎంత పెట్టుబ‌డి పెడుతున్నారు. మీ వ‌ద్ద ఎంత ఉంది. ఇంకా ఎంత కావాలి అని లెక్కించుకొని దీనిఎసం నెల‌వారిగా సిప్ చేయండి. రూ.5 వేల నుంచి 7 వేల వ‌ర‌కు సిప్ రూపంలో 15 ఏళ్లు పెట్టుబ‌డులు పెట్టండి. ఏడాదికి ఇది 10-20 శాతం పెంచుకుంటూ పోతే మంచిది. ఖ‌ర్చులు ఇంత‌గా పెరిగిపోతున్న ఈ రోజుల్లో పిల్ల‌ల చ‌దువుకోసం ఒకేసారి ఎక్కువ మొత్తంలో డ‌బ్బును ప‌క్కకు తీసిపెట్ట‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని, దీనికోసం దీర్ఘ‌కాలీకంగా ప్ర‌ణాళిక వేసుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు.

రుణం గురించి కూడా ప‌రిశీలించాలి:

పిల్ల‌ల్ని విదేశాల‌కు పంపించాలంటే కోటి రూపాయ‌ల‌ వ‌ర‌కు సిద్ధం చేసుకొని ఉండాలి. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే పిల్ల‌ల ఉన్న‌త విద్య ఒక్క‌టే వారి ల‌క్ష్యం కాదు. అప్ప‌టికీ ప‌దవీ విర‌మ‌ణ‌ కూడా ద‌గ్గ‌ర‌ప‌డుతుంది. ఆ స‌మ‌యంలో ఉన్న‌త విద్య కోసం విద్యారుణం ల‌భిస్తుంది, కానీ ప‌దవీ విర‌మ‌ణ‌కు ఎలాంటి రుణం ల‌భించ‌దు. కాబ‌ట్టి దానిని దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యం తీసుకోవాలి.

సొంత డ‌బ్బా ? లేదా రుణ‌మా?

కొంత‌మంది ఉన్న‌త విద్య కోసం త‌మ‌కు స‌రిపోయేంత డ‌బ్బు ఉన్న‌ప్పుడు మ‌ళ్లీ రుణం ఎందుకుఅనుకుంటారు. ఇక్క‌డ తెలుసుకోవాల్సింది ఏంటంటే… విద్యా రుణం తీసుకొని ఇతర పెట్టుబ‌డులకు, మీ ఆదాయం పెంపొందించే మార్గాల‌కు వినియోగించుకోవ‌చ్చు. రుణం చెల్లింపులు ఉంటేనే డ‌బ్బు సంపాద‌నపై దృష్టి సారిస్తారు లేక‌పోతే ఉన్న‌ది క‌రిగిపోతుంది. రుణం తీసుకుంటే ప‌న్ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. విద్యా రుణంపై వ‌డ్డీ రేట్ల‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఎంత రుణం తీసుకున్నా వ‌డ్డీపై ప‌న్ను క్లెయిమ్ చేసుకునేందుకు ప‌రిమితులు ఉండ‌వు. అదేవిదంగా విద్యారుణం ఉంటేనే పిల్ల‌లు కొంత బాద్య‌త‌గా వ్య‌వ‌హరించే అవ‌కాశం ఉంటుంది. వారి చ‌దువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం వెతుకుతున్న స‌మ‌యంలో ఇబ్బందులు రాకుండా మీ వ‌ద్ద ఉన్న డ‌బ్బును అప్పుడు వారికి ఇవ్వొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని