అన్ని రుణాల‌కు క్రెడిట్ కార్డులే గేట్‌వే

క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హైమార్క్‌ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2019 నాటికి క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న మొత్తం 4.27 కోట్ల మందిలో, 65శాతం మంది ఇప్పటికే వేరే రకాల రుణాలను కూడా పొందుతున్నారు. మిగిలిన 35% సభ్యులు లేదా 1.51 కోట్ల

Published : 17 Dec 2020 22:32 IST

క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హైమార్క్‌ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2019 నాటికి క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న మొత్తం 4.27 కోట్ల మందిలో, 65శాతం మంది ఇప్పటికే వేరే రకాల రుణాలను కూడా పొందుతున్నారు. మిగిలిన 35% సభ్యులు లేదా 1.51 కోట్ల మంది వారిని అనుసరిస్తున్నారు .

ఇందులో 21 శాతం మంది వ్యక్తిగత రుణాలు, 18 శాతం మంది గృహోపకరణ వినియోగ వస్తువుల రుణాలు, 14 శాతం మంది ఆటో రుణాలు , 12 శాతం మంది గృహ రుణాలు, 6 శాతం మంది ద్విచక్ర వాహన రుణాలు , 6 శాతం మంది బంగారం
రుణాలు తీసుకున్నారు.

ఒకసారి క్రెడిట్ కార్డు పొందిన వ్యక్తి అన్ని వివరాలు ఉంటాయి కనుక , ఇతర రుణాలను అందించడం బ్యాంకులకు సులభంగా ఉంటుంది . నవంబర్ 2019 నాటికి 5.44 కోట్ల క్రెడిట్ కార్డులు ఇచ్చినప్పటికీ , వినియోగంలో ఉన్నవి 5.01 కోట్ల కార్డులు. వీటి పోర్ట్ ఫోలియో మొత్తం విలువ రూ 1.24 లక్షల కోట్లు .

డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో , క్రెడిట్ కార్డు సభ్యులలో పెరుగుదల 25 శాతం ఉంటే, వారి వినియోగంలో 44 శాతం పెరుగుదల కనిపించింది . కోవిడ్‌- 19 వలన ఏర్పడిన మార్పులకు డిజిటల్ చెల్లింపుల వైపుకు మళ్లటం, ఇంటర్నెట్ సదుపాయం , వలన టయర్ 2, 3 పట్టణాలలో నివసించే మరికొందరు క్రెడిట్ కార్డు ల వాడకంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది అని నివేదిక తెలిపింది.

మధ్య తరగతి , దిగువ మధ్య తరగతి ఆదాయం గలవారు క్రెడిట్ కార్డు వాడకంలో లభించే డిస్కౌంట్ల కోసం డెబిట్ కార్డు కన్నా క్రెడిట్ కార్డు లను వాడడం. అలాగే నవంబర్ 2016 లో విధించిన డిమానిటైజేషన్ కారణంగా ఏర్పడిన నగదు కొరతతో క్రెడిట్ కార్డు వినియోగం పెరిగింది. ఏటికేడాది ఈ వినియోగంలో వృద్ధి పెరుగుతోంది. 2015 లో వృద్ధి 26 శాతం నుంచి 2016 లో 31 శాతానికి , 2017లో 44 శాతానికి పెరిగింది. మెట్రో నగరాలలో కన్నా , టయర్ 2, టయర్ 3 నగరాలలో క్రెడిట్ కార్డు వాడకం బాగా పెరుగుతోంది .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని