క్రెడిట్ కార్డు రద్దు చేసుకునే ముందు....
క్రెడిట్ కార్డు రద్దు అనేది ఆవేశంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. అత్యవసర సమయాల్లో, సిబిల్ స్కోరును మెరుగుపర్చుకోవడంలో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కార్డును రద్దు చేసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటే కొన్ని అంశాలను పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో రద్దు ? క్రెడిట్ కార్డును
క్రెడిట్ కార్డు రద్దు అనేది ఆవేశంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. అత్యవసర సమయాల్లో, సిబిల్ స్కోరును మెరుగుపర్చుకోవడంలో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కార్డును రద్దు చేసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటే కొన్ని అంశాలను పరిశీలించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో రద్దు ? క్రెడిట్ కార్డును ఎక్కువగా రెండు సందర్భాల్లో రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చులు నియంత్రించుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవాలనుకుంటారు. వడ్డీ రేట్లు లేదా ఇతర నియమనిబంధనలు మనకు అనుకూలంగా లేవని భావిస్తే రద్దు చేసుకుంటాం. మరిన్ని కారణాలు - పాత క్రెడిట్ కార్డులనే కొనసాగిస్తూ కొత్త క్రెడిట్ కార్డు వాడనప్పుడు, వడ్డీ రేట్ల పెరుగుదల, వార్షిక రుసుములు భారీగా పెరిగిన సందర్భాల్లో వాడుకలో ఉన్న క్రెడిట్‌కార్డును రద్దు చేసుకోవాలనుకుంటాం. కొత్త నియమనిబంధనలకు కార్డుదారులు అంగీకరించని పక్షంలో క్రెడిట్‌కార్డు జారీదారు మీ కార్డును రద్దుచేయవచ్చు.
కార్డు పోయినా, ఎవరైనా అపహరించినా మోసపూరిత లావాదేవీలను నిర్మూలించేందుకు కార్డును రద్దు చేసుకోమని సాధారణ సలహా. రద్దు చేసుకునేందుకు…క్రెడిట్‌కార్డును అత్యుత్సాహంతో రద్దు చేసుకునే ముందు కొన్ని విషయాలను పరిగణనలోనికి తీసుకోండి. డౌన్‌గ్రేడ్ చేసుకోండి - వార్షిక రుసుముల మోత కారణంగా కార్డును రద్దుచేయదల్చుకుంటే క్రెడిట్ కార్డు రుణ పరిమితిని తగ్గించుకునే అంశాన్ని పరిశీలించండి. కొత్త కార్డు నియమనిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోండి. బాగా పరిశీలించాకే…క్రెడిట్ కార్డు రద్దు చేసుకునేందుకు అభ్యర్థన పెట్టాక… రిటెన్షన్ అధికారి మిమ్మల్ని సంప్రదించి రద్దు ప్రక్రియను నిలిపివేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తాడు. దీంట్లో భాగంగా మీకు బంపర్ ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంది. బోనస్ పాయింట్ల పెంపునో, వార్షిక ఫీజును మినహాయించడమో చేస్తాడు. కాబట్టి అలాంటివి ఆకర్షణీయంగా అనిపిస్తే పరిశీలించండి.
బకాయిలుంటే…క్రెడిట్ కార్డు బకాయిలను అలాగే ఉంచేసి రద్దు చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోరు దెబ్బ తింటుంది. స్వయంచాలిత చెల్లింపులుంటే…స్వయంచాలిత (ఆటోమెటిక్) చెల్లింపులుంటే వాటిని ఇతర కార్డుకు మళ్లించండి. కార్డు రద్దు వల్ల వాయిదాల చెల్లింపుల్లో జాప్యం లేదా మర్చిపోవడం లాంటివి జరగకుండా ఈ జాగ్రత్త నియంత్రిస్తుంది. అనవసరపు పెనాల్టీలు, చార్జీలు పడకుండా నిలువరించినవారమవుతాం. క్రెడిట్ కార్డును రద్దు చేసుకున్నంత మాత్రాన ఖర్చులను బాగా తగ్గించుకున్నట్టు కాదు. రద్దు చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి. కొత్త కార్డు తీసుకుంటే లావాదేవీలన్నీ దానికి మళ్లేలా తగు జాగ్రత్తలు తీసుకోండి. అర్హత ఉంది కదా అని పదుల సంఖ్యా లో క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం సరైన పధ్ధతి కాదు. దాన్ని నిర్వహించడం లో మీకు ఎన్నో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి మీకు ఎన్ని అవసరమో అవి మాత్రమే తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు