హోమ్‌లోన్ క‌న్వ‌ర్ష‌న్ ఫీజు క‌డుతున్నారా? అయితే ఇది మీ కోస‌మే!

ఇంటి రుణాల కోసం ప్ర‌యత్నించే వారికి గృహ రుణ మార్పిడి రుసుము(హోమ్ లోన్ కన్వ‌ర్ష‌న్ ఫీజు)ఎప్పుడూ ప్ర‌శ్నార్థ‌కంగానే క‌నిపిస్తుంది. వ‌డ్డీ రేట్లు త‌గ్గిన‌ప్పుడు అందుకనుగుణంగా మ‌న రుణాల వ‌డ్డీ రేట్ల‌ను మార్చుకునేందుకు బ్యాంకులు/బ‌్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌కు చెల్లించే రుసుమునే

Published : 16 Dec 2020 22:25 IST

ఇంటి రుణాల కోసం ప్ర‌యత్నించే వారికి గృహ రుణ మార్పిడి రుసుము(హోమ్ లోన్ కన్వ‌ర్ష‌న్ ఫీజు)ఎప్పుడూ ప్ర‌శ్నార్థ‌కంగానే క‌నిపిస్తుంది. వ‌డ్డీ రేట్లు త‌గ్గిన‌ప్పుడు అందుకనుగుణంగా మ‌న రుణాల వ‌డ్డీ రేట్ల‌ను మార్చుకునేందుకు బ్యాంకులు/బ‌్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌కు చెల్లించే రుసుమునే హోమ్ లోన్ కన్వ‌ర్ష‌న్ ఫీజు అంటారు. అయితే దీనిని ఎన్ని సార్లు స‌క్ర‌మంగా చెల్లించిన‌ప్ప‌టికీ మ‌న వ‌డ్డీ రేట్లు కొత్త‌గా రుణం తీసుకుంటున్న వారితో పోలిస్తే అధికంగానే ఉంటున్నాయి. దీనికి ముఖ్య కార‌ణం వీటిని స‌మీక్షించ‌డానికి ప్ర‌స్తుత రుణ గ్ర‌హీత‌ల‌కు ప్రామాణికమైన విష‌యాలు తెలియ‌క‌పోవ‌ట‌మే. హోమ్‌లోన్ క‌న్వ‌ర్ష‌న్ ఫీజు అంటే ఏంటి ప్ర‌స్తుత‌మున్న మీ గృహ రుణాల వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించుకునేందుకు బ్యాంకులు వ‌సూలు చేసే ఫీజునే హోమ్ లోన్ క‌న్వ‌ర్ష‌న్ ఫీజు అంటారు. సాధార‌ణంగా ఇది మీరు తీసుకున్న మొత్తం రుణంలో 0.25 నుంచి 0.5 శాతం మొత్తంతో పాటు కొన్ని ప‌న్నుల‌తో క‌లిపి విధిస్తారు. కొన్ని బ్యాంకులు వీటిపై గ‌రిష్ట ప‌రిమితికి మించి వ‌సూలు చేయవు.

* హోమ్ లోన్ క‌న్వ‌ర్ష‌న్ ఫీజు స‌క్ర‌మంగా చెల్లిస్తున్న‌ప్ప‌టికీ ఏ ఏ సంద‌ర్భాల‌లో మ‌నం జాగ్రత్త‌గా ఉండాలో తెలుసుకుందాం. ఉదాహ‌ర‌ణ‌కు మీకు మొత్తం రుణంలో ఇప్ప‌టి వ‌ర‌కూ పాక్షికంగానే మంజూర‌యి ఉంటే కొన్ని బ్యాంకులు మీరు తీసుకుంటున్న మొత్తం+ఇంత వ‌రకు మంజూరు కానీ రుణం పై క‌లిపి ఈ ఫీజును వ‌సూలు చేస్తాయి. ఇలాంటి సంద‌ర్భాలు రుణ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌యోజ‌న‌క‌రం కావు. దీనికి సంబంధించి మ‌రికొన్ని సంద‌ర్భాల గురించి మ‌నం తెలుసుకుందాం.

* మ‌నం హోమ్ లోన్ క‌న్వ‌ర్ష‌న్ ఫీజు చెల్లించిన‌ప్ప‌టికీ, వ‌డ్డీ రేట్లు మాత్రం కొత్త‌గా రుణం తీసుకుంటున్న వారితో పోలిస్తే స‌మానంగానే ఉంటాయి. సాధారణంగా రుణ గ్ర‌హీత‌లకు వ‌డ్డీ రేట్ల‌లో మార్పుల గురించిన స‌మాచారం తెలియ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి సంద‌ర్భాల‌లో బ్యాంకు అధికారుల‌తో నిత్యం సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం మంచిది. బ్యాంకుల‌ను మీరు సంప్ర‌దించిన‌ట్ల‌యితే వారు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంది. అడ‌గ‌నిదే అమ్మ‌యినా అన్నం పెట్ట‌దు క‌దా.
మీరు స‌క్ర‌మంగా నెల‌వారీ వాయిదాల‌ను చెల్లిస్తూ ఉంటే బ్యాంకుల‌కు మీ పై స‌ద‌భిఫ్రాయం క‌లిగి మీ హోమ్ లోన్ క‌న్వ‌ర్ష‌న్ ఫీజును మాపీ చేసే అవ‌కాశం ఉంది. ఒక వేళ అలా జ‌ర‌గ‌న‌ప్పుడు త‌క్కువ వ‌డ్డీ రేటు అందిస్తున్న మ‌రో బ్యాంకుకు మారుతున్న‌ట్లు మీ ప్ర‌స్తుత బ్యాంక్‌కు తెలియ‌జేయండి. వారు కొంత మేర దిగి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

* ప్ర‌త్య‌క్షంగా తెలియ‌జేయ‌న‌ప్ప‌టికీ కొన్ని బ్యాంకులు మీరు రుణం తీసుకున్న కాలా వ్య‌వ‌ధిలో రెండు నుంచి మూడు సార్లు హోమ్ లోన్ క‌న్వ‌ర్ష‌న్ ఫీజును వ‌సూలు చేస్తామ‌ని చెబుతాయి. దీని గురించి మీరు బ్యాంకును గ‌ట్టిగా అడిగితే మీ రుణంపై వ‌డ్డీ రేట్లు 0.1 నుంచి 0.2 శాతం మేర త‌గ్గే అవ‌కాశాలున్నాయి.

* చాలా బ్యాంకులు ఇప్పటికే ఉన్న గృహ రుణ వినియోగదారులకు వడ్డీ రేటును తగ్గించే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇది ఫ్లోటింగ్ వ‌డ్డీ రేటుతో స‌మానంగా ఉంటుంది. దీని గురించి మీరు ఆయా బ్యాంకుల‌కు సంబంధించిన వెబ్‌సైట్లు/బ‌్యాంక్ హెల్ప్‌లైన్ల ద్వారా స‌మాచారం సేక‌రించుకోవ‌చ్చు.

చివరగా…

పైన తెలుపబడిన అంశాలని జాగ్రత్తగా పరిశీలించి ఇంటి రుణం మార్పు గురించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా, రుణ వడ్డీ రేటు లో 0.75 నుంచి 1 శాతం కంటే తక్కువ తేడా ఉన్నప్పుడు బ్యాంకు మారకపోవడమే మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని