వేత‌న జీవులు కాక‌పోయినా ఇంటి రుణం పొందొచ్చు!

వేత‌నజీవులు కాన‌ప్ప‌టికీ మీరు ఇళ్లు కొనాల‌నుకుంటున్నారా అయితే ఎస్‌బీఐ మీకు మంచి అవ‌కాశాన్ని క‌ల్పించ‌నుంది. దీనికోసం ఎస్‌బీఐ, ఐఎమ్‌జీసీ(ఇండియ‌న్ మార్ట్‌గేజ్ గ్యారంటీ కార్పోరేష‌న్‌)తో క‌లిసి త‌న‌ఖా రుణాలిచ్చేందుకు అవ‌గాహ‌న ఒప్పందం(ఎమ్ఓయూ) చేసుకుంది. ఐఎమ్‌జీసీ సంస్థ‌

Published : 17 Dec 2020 18:30 IST

వేత‌నజీవులు కాన‌ప్ప‌టికీ మీరు ఇళ్లు కొనాల‌నుకుంటున్నారా అయితే ఎస్‌బీఐ మీకు మంచి అవ‌కాశాన్ని క‌ల్పించ‌నుంది. దీనికోసం ఎస్‌బీఐ, ఐఎమ్‌జీసీ(ఇండియ‌న్ మార్ట్‌గేజ్ గ్యారంటీ కార్పోరేష‌న్‌)తో క‌లిసి త‌న‌ఖా రుణాలిచ్చేందుకు అవ‌గాహ‌న ఒప్పందం(ఎమ్ఓయూ) చేసుకుంది. ఐఎమ్‌జీసీ సంస్థ‌ ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌, జెన్‌వ‌ర్త్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్స్ కార్పోరేష‌న్‌ల ఆధ్వ‌ర్యంలో న‌డిచే సంయుక్త సంస్థ. దేశంలోని రుణ‌దాత‌ల‌కు ఈ సంస్థ త‌న‌ఖా గ్యారంటీనిస్తుంది.

ఈ ప‌థ‌కం జీతం లేన‌టువంటి వారితో పాటు స్వ‌యం ఉపాధి పొందే వారికి కూడా వ‌ర్తిస్తుంది. వేత‌నం లేన‌టువంటి వారికి ఎస్‌బీఐ త‌న‌ఖా రుణాలివ్వ‌డం ఇదే తొలిసారి. పెరుగుత‌న్న అందుబాటు ధ‌రల ఇళ్ల డిమాండ్, విస్త‌రిస్తున్న గృహ రుణ మార్కెట్‌కి త‌గ్గ‌ట్లుగా రుణాలిచ్చేందుకు ఎస్‌బీఐ దీన్నొక అవ‌కాశంగా భావిస్తోంది.

రిస్క్‌కు త‌గ్గ‌ట్లుగా ఈ ప‌థ‌కంలో రుణ‌గ్ర‌హీత‌లు రుణం పొందే అవ‌కాశం ఉంది. వేత‌నం లేనటువంటి వారు త‌మ ఇంటి క‌ల నెర‌వేర్చుకునేందుకు ఈ ప‌థ‌కం దోహ‌ద ప‌డ‌నుంది. ఐఎమ్‌సీజీతో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నందున ఈ త‌ర‌హా ప‌థకాల‌ను ఎస్‌బీఐ మ‌రెన్నో చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని