ఇంటి రుణంపై భార్యభ‌ర్తలిద్ద‌రికీ ప‌న్ను మిన‌హాయింపుంటుందా?

ఇల్లు భార్య‌భ‌ర్త‌లిద్ద‌రిలో ఒక‌రి పేరుమీద ఉంటే స‌రిపోతుంది క‌దా . ఇద్ద‌రూ ఒక‌టే క‌దా అనొచ్చు? నిజ‌మే! ఎవ‌రి పేరున ఉన్నా వారిద్ద‌రూ ఉండొచ్చు. అయితే భ‌విష్య‌త్తులో ఎదుర‌య్యే కొన్ని ఊహించ‌ని సంద‌ర్భాల్లో భార్య లేదా భ‌ర్త పేరు మీద ఆస్తి ఉండ‌టం మూలంగా ఒక‌రికి

Published : 17 Dec 2020 18:31 IST

ఇల్లు భార్య‌భ‌ర్త‌లిద్ద‌రిలో ఒక‌రి పేరుమీద ఉంటే స‌రిపోతుంది క‌దా . ఇద్ద‌రూ ఒక‌టే క‌దా అనొచ్చు? నిజ‌మే! ఎవ‌రి పేరున ఉన్నా వారిద్ద‌రూ ఉండొచ్చు. అయితే భ‌విష్య‌త్తులో ఎదుర‌య్యే కొన్ని ఊహించ‌ని సంద‌ర్భాల్లో భార్య లేదా భ‌ర్త పేరు మీద ఆస్తి ఉండ‌టం మూలంగా ఒక‌రికి న‌ష్టం వాటిల్లే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే ముందుగానే ఉమ్మ‌డి యాజ‌మాన్యంలో ఇంటి కొనుగోలు లేదా నిర్మించుకుంటే భ‌విష్య‌త్తులో ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.
భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ క‌లిపి ఉమ్మ‌డిగా ఇంటిని నిర్మించుకునేందుకు రుణం తీసుకుంటే, వాటిపై ఇద్ద‌రికి వేర్వేరు గా ప‌న్ను మిన‌మాయింపులు ఉంటాయా? అలా కావాలంటే ఏం చేయాలి. త‌దిత‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఇంటి రుణం చెల్లించే న‌గ‌దుపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఇది అంద‌ర‌కూ తెలిసిన విష‌య‌మే. అయితే ఇక్క‌డ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ ఉద్యోగం చేస్తూ ఈఎమ్ఐలు చెల్లిస్తూ ఇంటి కొనుగోలు చేసిన సంద‌ర్భాల్లో ఇద్ద‌రూ ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు పొందే వీలుంటుంది.

ఉమ్మ‌డి మంచిదే…

ఉమ్మ‌డి యాజ‌మాన్యం ధృవీక‌రించే ప‌త్రాల‌ ఆధారంగానే ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. భార్య లేదా భ‌ర్త పేరు మీద ఆస్తి ఉండి, ఈఎమ్ఐలు ఇద్ద‌రూ చెల్లించిన‌ప్ప‌టికీ ప‌న్ను ప‌రిధిలో ఆ ఇంటి య‌జ‌మానిగా పేరున్న భ‌ర్త‌నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. కాబ‌ట్టి డాక్యుమెంటులో ప‌క్కాగా ఇద్ద‌రూ యాజ‌మాన్యం క‌లిగి ఉన్న‌ట్లు పేర్కొనాలి. ఈ మ‌ధ్య‌నే ఆదాయ‌ప‌న్నుశాఖ ట్రిబ్యూన‌ల్ ఒక కేసు విష‌యంలో ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చింది. కొనుగోలు చేసిన ఇంటి ధృవ‌ప‌త్రాల్లో ఇద్ద‌రి పేర్లు త‌ప్ప‌కుండా ఉండాలి. సాధార‌ణంగా అయితే ఇద్ద‌రికి 50 శాతం చొప్పున వాటా ఉంటుంది. ప్ర‌త్యేకంగా ఇంత శాతం భార్య‌కు, మిగిలిన‌ది భ‌ర్త‌కు అని ద్రవీక‌రించ‌వ‌చ్చు.

ఈ విష‌యం సుల‌భంగా అర్థంచేసుకునేందుకు ఒక ఉదాహ‌ర‌ణ‌…

కొత్త‌గా వివాహం జ‌రిగిన జంట‌ రాజు, రాణి ఇద్ద‌రూ ఒక సొంత ఇల్లు నిర్మిచుకుందామ‌ని నిర్ణ‌యించుకున్నారు. . ఇద్ద‌రూ ఉద్యోగం చేస్తున్నారు కాబ‌ట్టి భ‌ర్త జీతం ఇంటి ఈఎమ్ఐ కి చెల్లించ‌డం, భార్య జీతం ఇంటి ఖ‌ర్చుల‌కు ఉప‌యోగించ‌డం చేసేవారు. ఈ విధంగా చేస్తూనే ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు చేసేట‌పుడు ఇద్ద‌రు వేర్వేరుగా ప‌న్ను మిన‌హాయింపులు దాఖ‌లు చేశారు. నిజానికి ఆ ఇల్లు భ‌ర్త పేరుమీద ఉంది. దీంతో ఆదాయప‌న్ను శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం భార్య‌కు అందులో ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యాన్నేఇటీవ‌లె ఒక కేసు ఈ విష‌యంపై ఆదాయ‌పుప‌న్నుశాఖ ట్రిబ్యూన‌ల్ స్ప‌ష్ట‌త ఇచ్చింది.

వేరొక ఉదాహ‌ర‌ణ‌…

కృష్ణ, రాధ ఇద్ద‌రూ భార్య‌భ‌ర్తలు.ఇద్ద‌రూ ఉద్యోగం చేస్తున్నారు. ఇంటిని ఉమ్మ‌డి వాటాదార్లుగా కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రాధ, కృష్ణ‌లు ఇద్ద‌రికి ఆ ఇంటిపై స‌గం స‌గం వాటా ఉంది. దీంతో ఆదాయ‌ప‌న్ను దాఖ‌లు చేసేట‌పుడు ఇద్ద‌రు వేర్వేరుగా ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు చేశారు. ఇక్క‌డ ఆదాయ‌పు ప‌న్ను శాఖ నియ‌మాల‌కు అనుగుణంగా ఉండ‌టంతో వారికి ఎటువంటి అవాంత‌రం లేకుండా ప‌న్ను మిన‌హాయింపు పొందారు.

దీంతో పాటు క‌లిగే కొన్ని అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు…

ఇప్పుడు స‌మాన హ‌క్కులు క‌ల్పించే దిశగా మ‌న స‌మాజం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ క‌లిపి కొనుగోలు చేసే ఇంటికి ఎందుకు స‌మాన వాటా ఉండ‌కూడ‌దు. భ‌విష్య‌త్తు లో ఆలుమ‌గ‌ల దాంప‌త్య జీవితంలో చికాకులు ఏర్ప‌డి విడాకులు తీసుకుంటే భార్య‌కు, భ‌ర్త‌కు ధృవ‌ప‌త్రాల్లో ఉన్న దాని ప్ర‌కారం వాటా చ‌ట్ట‌బ‌ద్ధంగా అందుతుంది. భ‌ర్త‌కు తెలియ‌కుండా భార్య, భార్య‌కు తెలియ‌కుండా భ‌ర్త ఆ ఇంటిని విక్ర‌యించ‌డం కుద‌ర‌దు. అయితే ఎవ‌రి వాటా వారికి విక్ర‌యించుకునే లేదా బ‌దిలీ చేసే అవ‌కాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అంశాల‌ను ప్ర‌త్యేక ధృవీక‌ర‌ణ చేసి ఉండాలి.
చివ‌ర‌గా: 
భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ ఇద్ద‌రూ ఉద్యోగం చేస్తూ క‌లిపి కొనుగోలు చేస్తే ఉమ్మ‌డి వాటాదార్లుగా భార్య‌భ‌ర్త‌లు ఉండ‌టం మేలే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని