విద్యా రుణానికి ప్రత్యేక వెబ్సైట్-విద్యాలక్ష్మి
విద్యార్థుల చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదన్నది ప్రభుత్వాల ఆకాంక్ష. వారిని ప్రోత్సహించే దిశగా విద్యారుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తుంది. అంతవరకూ బాగానే ఉంది. విద్యారుణం పొందాలంటే ఎవరిని సంప్రదించాలి, ఏ బ్యాంకు విద్యారుణాన్ని సకాలంలో మంజూరు
విద్యార్థుల చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదన్నది ప్రభుత్వాల ఆకాంక్ష. వారిని ప్రోత్సహించే దిశగా విద్యారుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయిస్తుంది. అంతవరకూ బాగానే ఉంది. విద్యారుణం పొందాలంటే ఎవరిని సంప్రదించాలి, ఏ బ్యాంకు విద్యారుణాన్ని సకాలంలో మంజూరు చేస్తుంది. విద్యారుణ మంజూరుకు కావలసిన పత్రాలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను ఎవరిని అడగాలి లాంటి ప్రశ్నలు కోకొల్లలు. ప్రతి చిన్న విషయానికి ఇంటర్నెట్పై ఆధారపడుతున్న నేటి యువత అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వం ఓ కొత్త వెబ్‌సైట్‌ను ముందుకు తీసుకొచ్చింది.
బ్యాంకులు అందించే విద్యా రుణాలు, ప్రభుత్వ ఉపకార వేతనాల సమాచారమంతా ఒకేచోట విద్యాలక్ష్మి వెబ్సైట్లో అందుబాటులో ఉంది. వివిధ బ్యాంకులకు వేర్వేరుగా దరఖాస్తు చేయకుండా అన్నింటికీ కలిపి ఒక ఫారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఈ వైబ్‌సైట్ ప్రత్యేకత. రుణ దరఖాస్తు దశలోనే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన శ్రమను ఈ వెబ్సైట్ తప్పిస్తుంది.
విద్యాలక్ష్మి వెబ్సైట్లో ఉండే సదుపాయాలు:
* వివిధ బ్యాంకు రుణాల సమాచారాన్ని ఒకే చోట పొందవచ్చు.
* రుణాల కోసం గరిష్ఠంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* రుణ దరఖాస్తులను బ్యాంకులు నేరుగా ఈ వెబ్సైట్ నుంచే స్వీకరిస్తాయి.
* రుణ దరఖాస్తు స్థితిగతులను వెబ్సైట్లో ఉంచుతారు. బ్యాంకులకు వెళ్లకుండానే విద్యార్థి దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
* విద్యార్థి ఎదుర్కొనే సమస్యలను, సందేహాలను ఈ-మెయిల్ చేయవచ్చు.
* ప్రభుత్వ ఉపకార వేతనాలను అందించే జాతీయ ఉపకార వేతనాల వివరాలను ఈ వెబ్‌సైట్‌కు అనుసంధానించారు.
వెబ్సైట్లో నమోదు:
ఈ వెబ్సైట్ ద్వారా విద్యారుణాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తమ పేరు, వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక్కో విద్యార్థికి ప్రత్యేక పేజీని కేటాయిస్తారు.
విద్యారుణం దరఖాస్తు:
ఉమ్మడి విద్యా రుణ దరఖాస్తు ఫారంలో తగిన వివరాలను పొందుపరచాలి. ఉమ్మడి విద్యా రుణం దరఖాస్తు సాయంతో ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా మూడు బ్యాంకులకు మాత్రమే దరఖాస్తును చేసుకునే వీలుంది. ఫారంను నింపిన తర్వాత వివిధ బ్యాంకుల విద్యా రుణాల కోసం శోధించాలి. అవసరాలు, అర్హత, సౌకర్యానికి అనుగుణంగా రుణం కోసం దరఖాస్తు చేయాలి.
రుణ దరఖాస్తుల ఆమోద-తిరస్కరణలు
దరఖాస్తు స్థితిని గురించి బ్యాంకు విద్యాలక్ష్మి వెబ్సైట్లో ఉంచుతుంది. విద్యార్థి వెబ్సైట్లో లాగిన్ అయి దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. అన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తుకు బ్యాంకు ఆమోదం తెలుపుతుంది. బ్యాంకు నియమ నిబంధనలను సంతృప్తిపరచకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారు. బ్యాంకు అడిగిన పత్రాలను సమర్పించకపోతే దరఖాస్తులను హోల్డ్‌లో ఉంచుతారు. విద్యార్థి ప్రత్యేక పేజీలో అందుకు గల కారణాలను రాసి ఉంచుతారు.
రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్టుగా బ్యాంకు భావించి ఆమోదిస్తే … రుణ సంబంధిత సొమ్ము నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. వీటిని వెబ్సైట్ హోం పేజీలోనే చూసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు