మధ్య ఆదాయ వర్గాలకు గృహరుణాలపై తగ్గింపు ఎంత?
సగటు మధ్యతరగతి జీవికి సొంతింటి కల నెరవేర్చుకోవడం అపూర్వ ఘట్టం. మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కట్టుకునేందుకు ఆసరా ఇచ్చేలా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మధ్యతరగతి ఆదాయ వర్గానికి చెందినవారికి ఎలాంటి
సగటు మధ్యతరగతి జీవికి సొంతింటి కల నెరవేర్చుకోవడం అపూర్వ ఘట్టం. మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కట్టుకునేందుకు ఆసరా ఇచ్చేలా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మధ్యతరగతి ఆదాయ వర్గానికి చెందినవారికి ఎలాంటి లబ్ధి చేకూర్చే అంశాలున్నాయో తెలుసుకుందాం. మధ్యతరగతికి చెందినవారి వార్షిక ఆదాయం రూ.6 నుంచి రూ.12లక్షల లోపు ఉన్నట్లయితే వారు మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఎంఐజి-1 కిందికి వస్తారు. అదే వారి సంవత్సర ఆదాయం రూ.12 నుంచి రూ.18లక్షల మధ్య ఉంటే ఎంఐజి-2 కిందికి పరిగణిస్తారు. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహరుణ వడ్డీలపై సబ్సిడీనిస్తారు. గృహ కొనుగోలు, నిర్మాణం, తిరిగి కొనుగోలు ఏదైనా సరే సబ్సిడీని పొందొచ్చు.
ఈ సబ్సిడీని పొందేందుకు లబ్ధిదారుని కుటుంబం ఇది వరకే పక్కా ఇంటిని సొంతం చేసుకొని ఉండరాదు. ముఖ్యంగా కుటుంబసభ్యుల పేరిట మన దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. ఈ పథకం కింద ఇంటి రుణాన్ని ఒక రుణ సంస్థ నుంచి పొంది మరొక రుణ సంస్థకు మార్చుకుంటే గనుక సదరు వ్యక్తి సబ్సిడీ పొందేందుకు అర్హత కోల్పోతాడు.
మిడిల్ ఇన్కమ్ గ్రూప్-1
వార్షిక కుటుంబ ఆదాయం రూ.6-12 లక్షల మధ్య ఉన్నవారు రూ.9లక్షల గృహరుణ వడ్డీపై 4శాతం సబ్సిడీకి అర్హులు. రుణ కాలపరిమితి మొత్తానికి లేదా గరిష్టంగా 20ఏళ్లకు… వీటిలో ఏది తక్కువైతే ఆ కాలావధికి సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది. 160 చదరపు మీటర్లు లేదా 1718 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలి. రూ.9లక్షల పైన అదనంగా ఉండే రుణానికి సబ్సిడీ వర్తించదు. ఆ లోపు దానికి మాత్రం సబ్సిడీ వర్తిస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
వినయ్ కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలు. రూ.6లక్షల రుణాన్ని 10శాతం వార్షిక వడ్డీకి 20ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నాడనుకుందాం. ఈ రుణంపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ ప్రయోజనాన్ని పొందలేదు. అప్పుడు అతడు చెల్లించే నెలవారీ వాయిదా రూ.5,790గా ఉంటోంది. ఇప్పుడు ఆవాస్ యోజన గురించి తెలుసుకున్నాక… దాని ద్వారా 4శాతం సబ్సిడీ పొందాడు. ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ)ని 9శాతంగా భావిస్తే మొత్తం రూ.1,56,712 అవుతుంది. ఈ తగ్గింపును రుణ మొత్తంలోంచి తీసివేస్తే గృహరుణం రూ.4,43,288 అవుతుంది. (6,00,000 - 1,56,712= 4,43,288) . దీనికి ఈఎమ్ఐగా రూ.4,278 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.1,512 ఆదా అవుతుంది. మిగులుతో ఇలా…సబ్సిడీ ద్వారా నెలకు మిగిలే సొమ్మును ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్లలో 20ఏళ్ల పాటు సిప్ చేసినట్లయితే మొత్తం వడ్డీ సొమ్మును పరిహరించుకోవచ్చు. పన్ను ప్రయోజనాలు - ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80సీ కింద రూ.1.5లక్షల వరకు రుణ అసలు (ప్రిన్సిపల్ సొమ్ము)పై పన్ను మినహాయింపు ఉంది. ఇది కాకుండా సెక్షన్ 24 బి కింద అదనంగా రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
మిడిల్ ఇన్కమ్ గ్రూప్-2:
వార్షిక కుటుంబ ఆదాయం రూ.12-18 లక్షల మధ్య ఉన్నవారు రూ.12లక్షల గృహరుణ వడ్డీపై 3శాతం సబ్సిడీకి అర్హులు. రుణ కాలపరిమితి మొత్తానికి లేదా గరిష్టంగా 20ఏళ్లకు… వీటిలో ఏది తక్కువైతే ఆ కాలావధికి సబ్సిడీ ప్రయోజనం వర్తిస్తుంది. 200 చదరపు మీటర్లు లేదా 2147 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉండాలి. రూ.12లక్షల పైన అదనంగా ఉండే రుణానికి సబ్సిడీ వర్తించదు. ఆ లోపు దానికి మాత్రం సబ్సిడీ వర్తిస్తుంది.
పనిచేసే విధానం:
విశాల్ కుటుంబ వార్షిక ఆదాయం రూ.14లక్షలు. 10శాతం వార్షిక వడ్డీకి రూ.9లక్షల రుణాన్ని 20ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నాడనుకుందాం. ఈ రుణంపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీ ప్రయోజనాన్ని పొందలేదు. అప్పుడు అతడు చెల్లించే నెలవారీ వాయిదా రూ.8,685గా ఉంటోంది.
ఇప్పుడు ఆవాస్ యోజన గురించి తెలుసుకున్నాక… దాని ద్వారా 3 శాతం సబ్సిడీ పొందాడు. ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ)ని 9శాతంగా భావిస్తే మొత్తం రూ.1,72,617 అవుతుంది. ఈ తగ్గింపును రుణ మొత్తంలోంచి తీసివేస్తే వాస్తవ గృహరుణం రూ.7,27,383 అవుతుంది. (9,00,000 - 1,72,617= 7,27,383) . దీనికి ఈఎమ్ఐగా రూ.7,019 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.1,666 ఆదా అవుతుంది.
మిగులు పెట్టుబడిగా…
సబ్సిడీ ద్వారా నెలకు మిగిలే సొమ్మును ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్లలో 20ఏళ్ల పాటు సిప్ చేసినట్లయితే మొత్తం వడ్డీ సొమ్మును పరిహరించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203