విద్యా రుణంపై ప‌న్ను మిన‌హాయింపులు

వ్యక్తి జీవితంలో విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక ఇబ్బందులు చదువులకు ఆటంకం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం విద్యారుణాలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ అనుమతితో భారతీయ బ్యాంకుల సమాఖ్య (ఐబీఏ) ఏప్రిల్‌ 2001లో విద్యారుణ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం

Published : 17 Dec 2020 19:47 IST

వ్యక్తి జీవితంలో విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక ఇబ్బందులు చదువులకు ఆటంకం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం విద్యారుణాలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్‌బీఐ అనుమతితో భారతీయ బ్యాంకుల సమాఖ్య (ఐబీఏ) ఏప్రిల్‌ 2001లో విద్యారుణ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం చదువు ప్రాముఖ్యత పెరిగే కొద్దీ నాణ్యమైన విద్య అభ్యసించేందుకు ఎక్కువ డబ్బు అవసరం అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్ర‌భుత్వం వివిధ ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తోంది. ఉన్న‌త విద్య కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఆదాయ‌ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80ఈ కింద‌ వరుసగా ఎనిమిదేళ్ల వరకు ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. సెకండ‌రీ విద్య త‌ర్వాత సీనియ‌ర్ సెకండ‌రీ విద్య‌ను అభ్య‌సిస్తూ వ‌డ్డీని క్లెయిమ్ చేసుకునే అవ‌కాశ‌ముంది. ఇది మీరు సొంతంగా లేదా మీ పిల్ల‌ల చ‌దువు కోసం, భ‌ర్త లేదా భార్య కోసం, మీ సంర‌క్ష‌ణ‌లో పెరుగుతున్న పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల కోసం కూడా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.మీరు చెల్లిస్తున్న వ‌డ్డీని బ‌ట్టి ప‌న్ను మిన‌హాయింపులు ఉంటాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఒక సంవ‌త్స‌రంలో ఉన్న రుణంపై ఉన్న వ‌డ్డీ బ‌కాయిలు మొత్తం చెల్లిస్తే ఆ సంవ‌త్స‌రానికి మొత్తం వ‌డ్డీ క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది.

సంవ‌త్స‌రానికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. అయితే ఇక్క‌డ ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన విష‌యం ఏంటంటే రుణంపై వ‌డ్డీ చెల్లింపుల‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ప్ర‌పంచంలో ఎక్క‌డ విద్య‌ను అభ్య‌సిస్తున్న ఫ‌ర్వాలేదు. కానీ ట్యూష‌న్ ఫీజు క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం వారు దేశంలోనే చ‌దువుతుండాలి.

వ‌డ్డీని క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు దేశంలోని బ్యాంకులు, ప్ర‌భుత్వం ఆమోదం పొందిన‌ ఆర్థిక సంస్థలు లేదా కేంద్రం ఆమోదించిన
స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ల నుంచి రుణం తీసుకొని ఉండాలి. బంధువుల నుంచి కానీ స్నేహితుల నంచి కానీ రుణం తీసుకుంటే క్లెయిమ్ చేస‌కునేందుకు వీలుండ‌దు.

ట్యూష‌న్ ఫీజు చెల్లింపులు:

ప‌న్ను చ‌ట్టాల ప్ర‌కారం ట్యూష‌న్ ఫీజు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంది. గ‌రిష్టంగా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది. ఇత‌ర ప‌థ‌కాలైన‌ పీఎఫ్, పీపీఎఫ్, గృహ రుణ వ‌డ్డీ చెల్లింపులు, బీమా ప్రీమియంలు వంటి వాటిలో భాగంగానే దీనికి కూడా ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. పాఠ‌శాల‌, కళాశాల‌, విశ్వ‌విద్యాల‌యం, లేదా ఇత‌ర విద్యా సంస్థ‌ల్లో విద్య‌ను అభ్య‌సిస్తున్న‌ప్ప‌టికీ ఇది వ‌ర్తిస్తుంది. అయితే కోచింగ్ త‌ర‌గుతులు, ఇత‌ర డొనేష‌న్లు, డెవ‌ల‌ప్‌మెంట్ ఫీజుల‌కు క్లెయిమ్ చేసుకునే వీలండ‌దు. ఇద్ద‌రి కంటే ఎక్కువ పిల్ల‌లు ఉంటే, ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు ఉద్యోగ‌స్తులైతే ఎవ‌రైనా ఒక‌రు, ఇద్ద‌రి పిల్ల‌ల‌కు క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది.

వేత‌న జీవుల‌కు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు:

పైన చెప్పిన‌వాటితో పాటు వేత‌న జీవుల‌కు, స్వ‌యం ఉపాధి క‌లిగిన వారు వారి సంస్థ నుంచి మ‌రిన్ని ఉప‌క‌ర‌ణాలు పొంద‌వ‌చ్చు. అవి ఏంటంటే మొద‌ట‌గా ఇద్ద‌రి పిల్ల‌ల విద్య కోసం సంస్థ నుంచి నెల‌కు రూ.100 చొప్పున అంద‌జేస్తారు. రెండ‌వ‌ది, హాస్ట‌ల్ ఖ‌ర్చుల కోసం రూ.300 చొప్పును ఇద్ద‌రి పిల్ల‌ల‌కు ఇస్తారు. అయితే ఇప్ప‌టికే మీ వేత‌నంలో వీటిని క‌లిపి ఇస్తుంటే మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా ఇవ్వ‌డం జ‌ర‌గదు. దీని ప్ర‌కారం చూస్తే ప్ర‌భుత్వం విద్య‌ను ప్రోత్స‌హించేందుకు చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుద‌న్న విష‌యం అవ‌గ‌త‌మ‌వుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని