విదేశాల్లో చ‌ద‌వాల‌నేది మీ క‌లా! అయితే ఇది మీ కోసమే

దేశంలో అతి పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థుల కోసం ఎన్నో ర‌కాల విద్యా రుణాల‌ను ఇస్తోంది. ముఖ్యంగా విదేశాల్లోని కాలేజీలు/యూనివ‌ర్సిటీల‌లో పూర్తి స్థాయి రెగ్యుల‌ర్ కోర్సుల‌ను చ‌దివాల‌నుకునేవారి కోసం గ్లోబ‌ల్ ఎడ్‌-వాంటేజ్ ప‌థ‌కం కింద రుణాల‌ను అంద‌జేస్తోంది. ఈ ప‌థ‌కం

Published : 17 Dec 2020 22:09 IST

దేశంలో అతి పెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థుల కోసం ఎన్నో ర‌కాల విద్యా రుణాల‌ను ఇస్తోంది. ముఖ్యంగా విదేశాల్లోని కాలేజీలు/యూనివ‌ర్సిటీల‌లో పూర్తి స్థాయి రెగ్యుల‌ర్ కోర్సుల‌ను చ‌దివాల‌నుకునేవారి కోసం గ్లోబ‌ల్ ఎడ్‌-వాంటేజ్ ప‌థ‌కం కింద రుణాల‌ను అంద‌జేస్తోంది. ఈ ప‌థ‌కం కింద క‌నిష్టంగా రూ.20 ల‌క్ష‌ల నుంచి మొద‌లుకొని గ‌రిష్టంగా రూ.1.50 కోట్ల వ‌ర‌కు రుణాల‌ను పొంద‌వ‌చ్చు. పూర్తి వివ‌రాల కోసం sbi.co.in సంద‌ర్శించాల్సిందిగా బ్యాంక్ తెలిపింది.

ఎస్‌బీఐ గ్లోబ‌ల్ ఎడ్‌-వాంటేజ్ రుణాల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు:

అర్హ‌త:
అమెరికా, యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, ఐరోపా, సింగ‌పూర్‌, జ‌పాన్‌, హాంగ్‌కాంగ్‌, న్యూజిలాండ్ దేశాల్లోని యూనివ‌ర్సిటీలు/కాలేజీలు అందించే రెగ్యుల‌ర్ గ్రాడ్యుయేష‌న్, పోస్టు గ్రాడ్యేయేట్‌, డాక్ట‌రేట్ కోర్సులు చ‌దివాల‌నుకునే వారు ఈ రుణాలు పొంద‌డానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

రుణ మొత్తం:

క‌నిష్టంగా రూ.20 లక్ష‌ల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. గ‌రిష్టంగా రూ.1.50 కోటి వ‌ర‌కు రుణం ల‌భిస్తుంది. రుణం పొందేందుకు మీరు కొంత మొత్తం మార్జిన్ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. మిగ‌తా మొత్తాన్ని బ్యాంకు చెల్లిస్తుంది. స్కాలర్‌షిప్/ అసిస్టెంట్‌షిప్ మార్జిన్‌లోనే క‌లిసి ఉంటుంది. రుణం మొత్తాల‌ను ద‌ఫాల వారీగా ప్రో-రేటా ప్రాతిప‌దిక‌న ఇస్తారు. అయితే మార్జిన్ మొత్తాన్ని వార్షిక ప్రాతిపదిక‌న చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ప్ర‌తీ ద‌ర‌ఖాస్తుకు రూ.10 వేలు క‌ట్టాల్సి ఉంది. కోర్సు చ‌దివే కాలం, మార‌టోరియం స‌మ‌యంలో సాధార‌ణ వ‌డ్డీ రేట్లు అమ‌ల్లో ఉంటాయి.

అవ‌స‌ర‌మ‌య్యే ప‌త్రాలు:

* అడ్మిష‌న్ లెట‌ర్‌

* పూర్తి వివ‌రాలతో కూడిన రుణ ద‌ర‌ఖాస్తు ప‌త్రం

* రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు

* విద్యార్థి తండ్రి లేదా సంర‌క్ష‌కుడి పాన్ కార్డు

* విద్యార్థి తండ్రి లేదా సంర‌క్ష‌కుడి ఆధార్‌ కార్డు

* ఏదేనీ గుర్తింపు ప‌త్రం(డ్రైవింగ్ లైసెన్సు/పాస్‌పోర్టు/ఫొటోతో కూడిన గుర్తింపు ప‌త్రం)

* చిరునామా ప‌త్రం(డ్రైవింగ్ లైసెన్సు/ఎల‌క్ట్రిసిటీ బిల్లు/టెలిఫోన్ బిల్లు)

* విద్యా వ్య‌యానికి సంబంధించిన స్టేట్‌మెంట్

* విద్యార్థి/స‌హా రుణ గ్ర‌హీత/గ్యారెంట‌ర్ కి చెందిన ఆరు నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లు

* విద్యార్థి తండ్రి/స‌ంర‌క్ష‌కుడి లేదా స‌హా రుణ గ్ర‌హీత‌కు చెందిన 2 ఏళ్ల‌ ఐటీ రిట‌ర్నులు/ ఐటీ మ‌దింపు ఆర్డ‌రులు

* విద్యార్థి తండ్రి/స‌ంర‌క్ష‌కుడి లేదా స‌హా రుణ గ్ర‌హీత‌కున్న ఆస్తులు, అప్పుల గురించి క్లుప్తంగా ఉన్న స్టేట్‌మెంట్లు

* విద్యార్థి తండ్రి/స‌ంర‌క్ష‌కుడి లేదా స‌హా రుణ గ్ర‌హీత‌కు చెందిన ఆదాయ వివ‌రాలు(వేత‌న ర‌శీదులు లేదా ఫారం-16)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని