వ్య‌క్తిగ‌త రుణం తీసుకుంటున్నారా? మ‌రి ఇవి తెలుసుకోండి!

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు వ్య‌క్తిగత రుణం ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే వ్య‌క్తిగ‌త రుణం తీసుకునేముందు బ్యాంకు నియ‌మ‌, నిబంధ‌న‌లు, వ‌డ్డీ రేట్లు, కాల పరిమితి, ఆల‌స్య రుసుము వంటివి తెలుసుకోవాలి. వ్య‌క్తిగ‌త రుణం పొందేందుకు కావ‌ల‌సిన అర్హ‌త‌లు కూడా తెలుసుకుంటే

Published : 18 Dec 2020 16:10 IST

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు వ్య‌క్తిగత రుణం ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే వ్య‌క్తిగ‌త రుణం తీసుకునేముందు బ్యాంకు నియ‌మ‌, నిబంధ‌న‌లు, వ‌డ్డీ రేట్లు, కాల పరిమితి, ఆల‌స్య రుసుము వంటివి తెలుసుకోవాలి. వ్య‌క్తిగ‌త రుణం పొందేందుకు కావ‌ల‌సిన అర్హ‌త‌లు కూడా తెలుసుకుంటే సుల‌భంగా రుణం ల‌భించే అవ‌కాశ‌ముంది.

క్రెడిట్ స్కోర్‌:

బ్యాంకులు ఎక్కువ‌గా రుణం అందించేందుకు క్రెడిట్ స్కోర్‌ను ప‌రిశీలిస్తాయి. తిరిగి చెల్లించేందుకు ఉన్నస్థోమ‌త‌, ఆదాయం, మూలాల‌ను బ‌ట్టి అంచ‌నా వేస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేక‌పోతే అప్లికేష‌న్ తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంది. రుణానికి దాఖ‌లు చేసుకోవాల‌నుకుంటే ముందు క్రెడిట్ స్కోర్‌ను మెరుగుప‌రుచుకోవ‌డం మంచిది. క్రెడిట్ స్కోర్‌ను గూగుల్‌లో ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

వ‌డ్డీ రేట్లు, కాల‌ప‌రిమితి:

వ్య‌క్తిగ‌త రుణానికి వ‌డ్డీ రేట్లు సాధార‌ణంగా ఎక్కువ‌గా ఉంటాయి. ఎందుకంటే చాలావ‌ర‌కు వ్య‌క్తిగ‌త రుణాల‌కు ఎలాంటి హామీ ఉండ‌దు. భ‌ద్ర‌త త‌క్కువ ఉంటుంది. బ్యాంకులు స‌గ‌టుగా 11 శాతం నుంచి 16 శాతం వ‌డ్డీరేట్లు వ‌సూలు చేస్తాయి. ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు దీనికంటే ఎక్కువ రేట్లు విధిస్తాయి. వ‌డ్డీ రేట్లు, కాల ప‌రిమితిని బ‌ట్టి, నెల‌వారి వాయిదా (ఈఎమ్ఐ) ఉంటుంది. కాల‌ప‌రిమితి ఎక్కువ‌గా ఉంటే ఈఎంఐ త‌క్కువ‌గా ఉంటుంది. వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే కూడా వ‌డ్డీ రేట్లు త‌గ్గించే అవ‌కాశ‌ముంటుంది.

ప్రాసెసింగ్ ఫీజులు:

ప్రాసెసింగ్ ఫీజులు గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోరు. కానీ ఇవి రుణ ప‌రిమాణంపై ఆధార‌ప‌డి ఉంటాయి. జీఎస్‌టీ, వ‌న్‌-టైమ్ ఫీజు వంటివి ఇందులోకి వ‌స్తాయి.

ఆల‌స్య రుసుములు:

ఈఎమ్ఐ చెల్లించ‌డం ఆల‌స్య‌మైతే లేదా మ‌రిచిపోతే బ్యాంకులు ఎక్కువ‌ రుసుములు విధిస్తాయి. ఖాతాలో స‌రిపోయినంత న‌గ‌దు లేక న‌గ‌దు ఎల‌క్ర్టానిక్ క్లియ‌రింగ్ స‌ర్వీస్ (ఈసీఎస్) తిర‌స్క‌రించినా ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకులు చాలా అధిక మొత్తంలో ఛార్జీల‌ను వ‌సూలు చేస్తాయి. ఇది ఒక్కోసారి ఈఎమ్ఐలో 5 శాతం నుంచి 10 శాతం వ‌ర‌కు కూడా ఉండే అవ‌కాశ‌ముంది.

ప్రీ-పేమెంట్‌, ఖాతా మూసివేత ఛార్జీలు:

ఎక్కువ‌మంది అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకుంటారు. త‌ర్వాత న‌గ‌దు వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే తిరిగి చెల్లిస్తారు. అందుకే గ‌డువు ముగింపుకంటే ముందే ఖాతాను మూసివేస్తే ఛార్జీలు ప‌డ‌తాయా, అవి ఎంత‌మేరకు ఉంటాయో తెలుసుకోవ‌డం మంచిది. కొన్ని బ్యాంకులు దీనికి ఛార్జీలు వ‌సూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు ఎలాంటీ ఫీజులు విధించ‌వు. అయితే గ‌డువు కంటే ముందే ఖాతా ముగిస్తే అధిక వ‌డ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు