వాహన రుణం పొందడం ఎలా?

చాలా మంది సొంత వాహనం కలిగి ఉండాలని ఆశ పడుతుంటారు. అది కారైనా లేదా బైకైనా అవచ్చు. వాహనం వారికి, కుటుంబానికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అయితే అందరికీ వాహనం కొనుక్కునేంత స్తొమత ఉండకపోవచ్చు. అలాగే వాహన కొనుగోలుకు కావాల్సినంత డబ్బు సిద్ధంగా ఉండ‌క‌పోవ‌చ్చు.అలాంటి

Published : 18 Dec 2020 16:11 IST

చాలా మంది సొంత వాహనం కలిగి ఉండాలని ఆశ పడుతుంటారు. అది కారైనా లేదా బైకైనా అవచ్చు. వాహనం వారికి, కుటుంబానికి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అయితే అందరికీ వాహనం కొనుక్కునేంత స్తొమత ఉండకపోవచ్చు. అలాగే వాహన కొనుగోలుకు కావాల్సినంత డబ్బు సిద్ధంగా ఉండ‌క‌పోవ‌చ్చు.అలాంటి వారికి వాహ‌న రుణం మంచి ఎంపిక‌.ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించి వాహనాన్ని కొనుగోలు చేయలేని వారు వాహన రుణాన్ని పొందవచ్చు. ప్రస్తుత కాలంలో వాహన రుణం పొందడం సుల‌భ‌మ‌నే చెప్పాలి.

బైక్ ధరలో 85 శాతం వరకు లేదా కొన్ని సందర్భాల్లో 90 - 95 శాతం రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే అది మనం తీసుకునే రుణ సంస్థ పై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న రుణాన్ని సుల‌భ‌మైన‌ పద్దతిలో నెల నెలా ఈఎమ్ఐగా చెల్లించాల్సి ఉంటుంది. వాహన రుణాన్ని ఎంచుకునే ముందు మీరు కొంత పరిశోధన చేయడం మంచిది. ఏయే సంస్థలు ఎంత వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తున్నాయో తెలుసుకోవాలి. త‌ద్వారా ఏ సంస్థ త‌క్కువ‌ వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తుందో మీకు తెలుస్తుంది. రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, రుణ చెల్లింపు కాలం, తిరిగి చెల్లించే నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలి. వాహన రుణం పొందే ముందు మీరు కొన్ని ప్రత్యేకమైన ప్రమాణాలను పాటించవలసి ఉంటుంది. ఇవి ఆయా సంస్థల‌ను బ‌ట్టి మారుతూ ఉంటాయి.

సాధారంణంగా ఉండే కొన్ని ప్రాథమిక ప్రమాణాలను చూద్దాం.

ఉపాధి స్థితి: రుణగ్రహీతలు (జీతం పొందేవారు, అలాగే స్వయం ఉపాధి వారు) రుణం పొందాలనుకుంటే వారి ఉద్యోగ లేదా ఆదాయ మూలాలకు సంబంధించిన రుజువులను సమర్పించవలసి ఉంటుంది.

జీతం: బైక్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, రుణగ్రహీత కనీసం ఆరునెలల ఉపాధి కలిగి ఉండి, జీతం తాలూకా రుజువును రుణదాతకు సమర్పించాలి.

గుర్తింపు రుజువు: రుణం కోసం దరఖాస్తు చేసుకునేప్పుడు గుర్తింపు, చిరునామా రుజువు తప్పనిసరిగా సమర్పించాలి.

బైక్ రుణం కోసం ఎలాంటి పత్రాలు అవసరమోనన్న విషయంపై మీరు ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. ఇప్పుడు రుణ దరకాస్తు ఎలా చేసుకోవాలో దశల వారీగా కింద చూద్దాం.

స్టెప్ 1: మీ బడ్జెట్, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలుసుకోండి

బైక్ రుణం కోసం దరఖాస్తు చేసుకోడానికి ముందు, మీ బడ్జెట్ ఎంతో తెలుసుకోవాలి. అలాగే ఏ విధమైన చెల్లింపు ప్రణాళిక మీకు సరిగ్గా సరిపోతుందో చూసుకోవాలి. రుణానికి సంబంధించిన పథకం వివరాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.

స్టెప్ 2: రుణ దరఖాస్తు ఫారమ్ ను పూరించండి

మీరు సరైన రుణానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత, రుణ సంస్థ మీ విశ్వసనీయతను తెలుసుకోడానికి సహాయపడే వివరాలను మీ దరఖాస్తులో పూరించండి. క‌చ్చితమైన సమాచారాన్ని మాత్రమే దరఖాస్తు ఫారమ్ లో నింపాలి. లేదంటే రుణ దరఖాస్తు ఫారం తిరస్కరణకు గురవుతుంది.

స్టెప్ 3: అవసరమైన పత్రాలను అందించండి

మీ కేవైసీ పత్రాలను సమర్పించాలి. అలాగే మీ వాహన రుణ ప్రక్రియ సజావుగా పూర్తి కావడానికి మీరు ఖచితమైన, అప్ డేటెడ్ సమాచారాన్ని అందించవలసి ఉంటుంది.

స్టెప్ 4: నిబంధనలను అర్థం చేసుకోండి

వాహన రుణాన్నిఆమోదించిన తర్వాత, రుణ సంస్థ నుంచి మీరు చట్టబద్ధమైన ఒప్పంద పత్రంతో పాటు రుణ మంజూరు లేఖను అందుకుంటారు. ఒప్పంద పత్రంలో వడ్డీ రేటు, రుణ వ్యవధి, మొదలైన వాటికి సంబంధించిన అన్ని నియమ నిభంధనలతో పాటు కొన్ని షరతులను తెలియ చేస్తారు. ఒప్పంద పత్రంలోని ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

స్టెప్ 5: రుణ ఒప్పందం మీద సంతకం చేయండి

చివరగా మీరు చేయవలసిన ఒకే ఒక్క పని రుణ ఒప్పందంపై సంతకం చేయడం. అనంతరం మీరు బ్యాంకు ఖాతాలో రుణ మొత్తాన్ని పొందుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని