ఇంటి రుణం తీసుకుంటున్నారా? వీటిని చెక్ చేయండి

సాధార‌ణంగా వ్య‌క్తులు తీసుకునే రుణాల్లో కాల‌వ్య‌వ‌ధి, రుణ‌మొత్తం ప‌రంగా చూస్తే గృహ‌రుణం పెద్ద ప‌రిమాణంలో ఉంటుంద‌నే చెప్పాలి. ఆ విధంగా పెద్ద మొత్తంలో ఈ రుణాన్ని తీసుకునేముందు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. వ‌డ్డీ రేటు, ప్రాసెసింగ్ రుసుములు త‌దిత‌ర ఛార్జీలు ఏవైనా

Published : 18 Dec 2020 19:26 IST

సాధార‌ణంగా వ్య‌క్తులు తీసుకునే రుణాల్లో కాల‌వ్య‌వ‌ధి, రుణ‌మొత్తం ప‌రంగా చూస్తే గృహ‌రుణం పెద్ద ప‌రిమాణంలో ఉంటుంద‌నే చెప్పాలి. ఆ విధంగా పెద్ద మొత్తంలో ఈ రుణాన్ని తీసుకునేముందు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. వ‌డ్డీ రేటు, ప్రాసెసింగ్ రుసుములు త‌దిత‌ర ఛార్జీలు ఏవైనా ఉంటే వాటిని ముందుగా తెలుసుకోవ‌డం మంచిది. గృహ‌రుణం లో వ‌డ్డీ రేటు స్థిర‌, చ‌ర వ‌డ్డీ రేటు క‌లిగి ఉంటాయి. స్థిర‌ వ‌డ్డీ (ఫిక్సిడ్) రేటు: ఇది గృహారుణం మొత్తం చెల్లించేవ‌ర‌కూ ఒకే విధ‌మైన వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది. చ‌ర‌ వ‌డ్డీ (ఫ్లోటింగ్) రేటు: ఇది రుణ కాల‌వ్య‌వ‌ధిలో మారుతూ ఉంటుంది. మార్కెట్ లో బెంచ్‌మార్క్ వ‌డ్డీ రేటు కు అనుగుణంగా ఉంటుంది. కాబ‌ట్టి బెంచ్‌మార్క్ రేటు త‌గ్గిన‌పుడు రుణం పై కూడా వ‌డ్డీరేటు త‌గ్గుతుంది.

వ‌డ్డీ రేటు:

రుణం తీసుకునే ముందు ప్ర‌ధానంగా వ‌డ్డీ రేటు ఎంత‌ని చూస్తుంటాం. స్థిర‌వ‌డ్డీ రేటు ఎటువంటి మార్పులేకుండా, చ‌ర వ‌డ్డీ రేటు పై తీసుకునే గృహ‌రుణాలు బెంచ్ మార్కు వ‌డ్డీ రేటు ఆధారంగా ఉంటాయి. ప్ర‌స్తుతం బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్ ప్రాతిపాదిక‌న వ‌డ్డీ రేట్లను నిర్ణ‌యిస్తున్నాయి. ఎమ్‌సీఎల్ఆర్ కు అద‌నంగా కొంత స్ప్రెడ్ ను వేసి గృహ‌రుణాల‌పై వ‌డ్డీని నిర్ణ‌యిస్తున్నాయి.

రుణాల‌కు సంబంధించి స్ప్రెడ్ అంటే రుణాలిచ్చే సంస్థ‌లు బెంచ్ మార్క్ రేటుపై అద‌నంగా వ‌సూలు చేసే వ‌డ్డీ రేటు.

రుసుములు:

రుణం తీసుకునేందుకు కొన్నిర‌కాల‌ రుసుములు, ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివి చెల్లించాలి. గృహ‌రుణం తీసుకున్న‌వారు రుణాల‌ను మంజూరు చేసే సంస్థ‌ల‌కు ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సాధార‌ణంగా ఇవి 0.25 - 0.50 శాతం వ‌ర‌కూ ఉంటాయి. ఇవి బ్యాంకుల ను బ‌ట్టీ మారుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం సెంట్రల్ బ్యాంకు 0.5 శాతం రుణం మొత్తంపై వ‌సూలు చేస్తుంది. అయితే గ‌రిష్టంగా ఈ మొత్తం రూ.20,000 కంటే మించ‌కూడ‌దు, అంటే ఎంత ఎక్కువ రుణం తీసుకున్నా ప్రాసెసింగ్ ఛార్జీలు రూ. 20,000 మించి ఉండ‌వు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌స్తుతం ప్రాసెసింగ్ ఛార్జీని రుణం మొత్తంలో 0.25 శాతం తీసుకుంటుంది. గ‌రిష్టంగా రూ.20,000 మించి ఉండ‌కూడ‌దు. గృహ‌రుణ కాల‌ప‌రిమితి సాధార‌ణంగా 20-30 ఏళ్లు ఉంటుంది.

చెక్ లిస్టు:

గృహ‌రుణం తీసుకోవాల‌నుకునే వారు ఒక్క వ‌డ్డీ రేట్ల‌ను మాత్ర‌మే కాకుండా ఇత‌ర రుసుములు , ప్రాసెసింగ్ ఫీజులు వంటి వాటిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా ఎక్క‌డ త‌మ‌కు అనుకూలంగా , త‌క్కువ వ‌డ్డీ రేటు కు ల‌భిస్తుందో ప‌రిశోధించి తెలుసుకోవాలి. అయితే ఇక్క‌డ వ‌డ్డీ రేటు మీ క్రెడిట్ స్కోరు ఆధారంగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉండేవారు బ్యాంకులు, గృహ‌రుణాలిచ్చే సంస్థ‌ల‌ను వ‌డ్డీ రేటు త‌గ్గించ‌మ‌ని అడిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

ప్రీపేమెంట్ ఛార్జీలు: ఒక వేళ రుణాన్ని ముందుగా తీర్చేయాల‌నుకుంటే ఏవైనా ప్రీపేమెంట్ ఛార్జీలు చెల్లించాలా అనేది తెలుసుకోవాలి.

లోన్ క‌న్వెర్ష‌న్ ఛార్జీలు: భ‌విష్యత్తులో ఎప్పుడైనా రుణాన్ని ఒక బ్యాంకు నుంచి మ‌రో బ్యాంకుకు మార్చుకోవాలంటే క‌న్వెర్ష‌న్ ఛార్జీలు ఎంత ఉంటాయో తెలుసుకోవాలి.

స్విచ్ ఓవర్ ఛార్జీలు: ఎప్పటికప్పుడు అర్బీఐ వడ్డీ రేట్లని సమీక్షిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రేట్లు తగ్గే లేదా పెరిగే అవకాశం ఉంది. అయితే రేట్లు పెరిగినప్పుడు బ్యాంకులు మీకు కొత్త రేట్లని వెంటనే అమలులోకి తెస్తాయి కానీ తగ్గినప్పుడు మాత్రం ఇలా చేయవు. మీరు ‘స్విచ్ ఓవర్ రిక్వెస్ట్’ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు 0.5 శాతం లేదా రూ. 50,000 (వీటిలో ఏది తక్కువ అయితే అది) రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి చార్జీలను ముందే పరిశీలించండి. 

ప్ర‌ధానంగా పై ఛార్జీలు ఉంటాయి. అయితే వీటితో పాటు అద‌నంగా బ్యాంకులు మ‌ధ్య‌లో ఏవైనా డాక్యుమెంట్లు, స్టేట్ మెంట్లు కావాలంటే వాటికి కొన్ని ఛార్జీలు వేస్తారు. ఇవి త‌క్కువ మొత్తంలోనే ఉంటాయి. అయిన‌ప్ప‌ట‌కీ వాటిని కూడా చెక్ చేసుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని