యజమాని నుంచి తీసుకునే వడ్డీ లేని రుణంపై పన్ను ఉంటుందా?

ఉద్యోగులు తాము ప‌నిచేసే సంస్థ‌ల‌ నుంచి వడ్డీ లేని రుణాలు పొందడం అనేది అసాధ్యమైన విషయం కాదు. ప్రపంచమంతటా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వడ్డీ రహిత లేదా రాయితీ రుణాలను అందిస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి రుణాలపై పన్ను చెల్లించాల‌ని ఎక్కువ

Published : 18 Dec 2020 19:27 IST

ఉద్యోగులకు యజమానులు అందించే వడ్డీ రహిత రుణాలపై పన్ను విధించబడుతుందని ఇటీవల ఆదాయ పన్ను అప్పీల్ ట్రిబ్యునల్ తెలిపింది.

ఉద్యోగులు తాము ప‌నిచేసే సంస్థ‌ల‌ నుంచి వడ్డీ లేని రుణాలు పొందడం అనేది అసాధ్యమైన విషయం కాదు. ప్రపంచమంతటా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వడ్డీ రహిత లేదా రాయితీ రుణాలను అందిస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి రుణాలపై పన్ను చెల్లించాల‌ని ఎక్కువ మందికి తెలియదు. ఉద్యోగులకు యజమానులు అందించే వడ్డీ రహిత రుణాలపై పన్ను చెల్లించాల‌ని ఇటీవల ఆదాయ పన్ను అప్పీల్ ట్రిబ్యునల్ తీర్పులో తెలిపింది. ఏదేమైనా, విలువ లెక్క‌క‌ట్ట‌డ‌మ‌నేది తాత్కాలిక పద్ధతిలో కాకుండా ఆదాయపు పన్ను చట్టం కింద‌ తెలిపిన నిర్దిష్ట పద్ధతిని అనుసరించాలి. ఇటీవల, చందు అనే ఉద్యోగి తన యజమాని నుంచి వడ్డీ లేని రుణాన్ని పొందాడు. 2010-11 ఆర్థిక సంవత్సరానికి, ఆదాయ పన్ను అధికారులు అతను తీసుకున్న వడ్డీ లేని రుణంపై 15 శాతం వడ్డీ చెల్లించవలసిందిగా అంచనా వేశారు. ఫలితంగా, అతని ఆదాయానికి రూ. 43.8 లక్షల మొత్తాన్ని జత చేశారు. అంతేకాకుండా, అతను ఆ ఆర్ధిక సంవత్సరానికి యజమాని - ఉద్యోగి మధ్య సంబంధం లేదని వాదించాడు, ఎందుకంటే కంపెనీ అతనికి చెల్లించిన రూ. 24 లక్షల జీతానికి టీడీఎస్ఎస్ ను తీసివేసింది.

అనంతరం, సీఐటీ వడ్డీ రహిత రుణాల విలువను ఆదాయ పన్ను అధికారిచే లెక్కిచాలని పేర్కొంది. అంతేకాక, రుణాలపై వడ్డీ ఇప్పటికే కంపెనీ నుంచి ల‌భించ‌లేద‌ని ఆదాయ పన్ను అధికారి అంచ‌నా వేసిన విలువ సరైనది కాదని సీఐటీ తిరస్కరించింది. విలువ‌ను లెక్కించేందుకు ఆదాయ‌పన్ను చట్టం ప్ర‌తిపాదించిన ప్రత్యేక పద్ధతిని పాటించాలని సీఐటి తెలిపింది. ఈ రుణాన్ని నిర్దిష్ట పద్ధతిలో పునరుద్దరించిన తరువాత ఆ ఆస్తి విలువ రూ.20.65 లక్షలుగా తేలింది. తరువాత, ఈ సమస్య చివరకు ఐటీఏటీ బెంచ్ కు చేరుకుంది. ఐటీఏటీ బెంచ్ సీఐటీ వాదనను సమర్థించింది.

యజమాని నుంచి వడ్డీ లేని రుణాల చెల్లింపు:

ఆదాయ పన్ను చట్టం1961 ప్రకారం, యజమాని నుంచి వడ్డీ-రహిత రుణాలపై పన్ను విధించదగినది :

స్టెప్ 1: ప్రతి నెలలో చివరి రోజున గరిష్ట అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ను లెక్కించండి.

స్టెప్ 2: రుణ పంపిణీ చేసిన సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీన ఎస్బిఐ వడ్డీ రేటును పరిగణించండి.

స్టెప్ 3: స్టెప్ 1లో తెలిపిన అవుట్ స్టాండింగ్ బ్యాలన్స్ ప్రకారం ప్రతినెలా వడ్డీ మొత్తాన్ని లెక్కించండి. స్టెప్ 2 లో తెలిపిన వడ్డీ రేటును పరిగణలోకి తీసుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు, స్టెప్ 3 కింద నిర్ణయించిన విలువ ఆధారంగా ఉద్యోగి నుంచి రికవర్ చేసిన అసలు వడ్డీని తీసివేయండి.

స్టెప్ 5: చివరగా, మిగిలిన మొత్తంపై పన్ను వసూలు చేస్తారు.

ఏదేమైనప్పటికీ, రెండు పరిస్థితుల్లో అటువంటి రుణాల విలువ మినహాయింపు ఉంటుంది. ఒకవేళ ఆరోగ్య బీమా పథకం కింద ఎలాంటి రీఎంబెర్స్మెంట్ పొందకపోతే, నిర్దిష్ట వ్యాధుల విషయంలో వైద్య చికిత్స కోసం రుణం పొంద‌వ‌చ్చు. ఒకవేళ ఉద్యోగికి ఇచ్చిన రుణ మొత్తం సంవత్సరానికి రు. 20,000 లేదా అంతకంటే తక్కువగా ఉంటే ఏం చేయాలి? ఇటువంటి రుణాన్ని తీసుకునే ఉద్యోగి, యజమాని తన మొత్తం జీతంలో టీడీఏస్ ను తీసివేస్తున్నాడో లేదో ముందుగా నిర్ధారించుకోవాలి. ఒకవేళ టీడీఏస్ ను తీసివేయకపోతే, అప్పుడు ఉద్యోగి రుణ మొత్తం పై ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని