గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ పెంపును తట్టుకోవడం ఎలా?

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత జూన్ ద్ర‌వ్య‌ప‌రప‌తి స‌మావేశంలో వ‌డ్డీ రేట్ల‌ను పావుశాతం పెంచింది. అయితే ఈ స‌మ‌యంలో చాలామంది వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయ‌ని అంచ‌నా వేశారు. అయితే వారి అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ కేంద్ర బ్యాంకు కీల‌క వ‌డ్డీ

Published : 18 Dec 2020 19:27 IST

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగున్న‌రేళ్ల త‌ర్వాత జూన్ ద్ర‌వ్య‌ప‌రప‌తి స‌మావేశంలో వ‌డ్డీ రేట్ల‌ను పావుశాతం పెంచింది. అయితే ఈ స‌మ‌యంలో చాలామంది వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయ‌ని అంచ‌నా వేశారు. అయితే వారి అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ కేంద్ర బ్యాంకు కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు పెంచొచ్చ‌నే సంకేతాలు రాగానే ప్ర‌ధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు రుణాలపై వ‌డ్డీ రేట్ల‌ను పెంచాయి.

దీంతో ప్ర‌స్తుతం రుణాలు తీసుకున్న‌వారికి నెల‌వారి వాయిదాలు (ఈఎమ్ఐ) మ‌రింత పెర‌గ‌నున్నాయి. గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు పెరుగుతాయి. అయితే ప్ర‌స్తుత రుణం తీసుకున్న‌వారు కొత్త వ‌డ్డీ రేట్ల ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండాలంటే రుణాన్ని ఆ బ్యాంకు నుంచి మ‌రో బ్యాంకుకి బ‌దిలీ చేసుకోవచ్చు.

వ‌డ్డీ రేట్ల‌పై ఆదా
గృహ రుణాల‌ను బ‌దిలీ చేయ‌డానికి ముఖ్య కార‌ణం వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించుకోవ‌డ‌మే. గృహ రుణ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ (హెచ్ఎల్‌బీటీ) కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే దీనిని తాజాగా రుణానికి దాఖ‌లు చేసుకున్న‌ట్లుగా ప‌రిగ‌ణిస్తారు. అప్పుడు మీరు బ‌దిలీ చేసుకున్న బ్యాంకు నిర్వ‌హ‌ణ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజుల వంటివి వ‌సూలు చేస్తుంది. ఇవి మీ ప్ర‌స్తుతం ఉన్న‌ వ‌డ్డీ రేట్ల కంటే త‌క్కువ‌గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి, లేదంటే ఇప్పుడున్న బ్యాంకులోనే కొన‌సాగించ‌డం మంచిది. గృహ రుణాన్ని బ‌దిలీ చేసుకునే ముందు ఆ బ్యాంకు విధించే ష‌ర‌తులు, వ‌డ్డీ రేట్లు ఫీజులు, ఛార్జీలు వంటి అన్ని వివరాల‌ను తెలుసుకోండి. అప్పుడు రుణ కాల‌ప‌రిమితి పెంచుకోవ‌డం లేదా మ‌రింత ఎక్కువ రుణం పొందే అవ‌కాశం ఏమైనా ఉందేమో ప‌రిశీలించండి.

ఎమ్‌సీఎల్ఆర్ త‌గ్గింపు కోసం…
ఆర్థిక సంస్థ‌లు గృహ రుణాల‌ను ఇత‌ర బ్యాంకుల‌కు బ‌దలాయించే స‌దుపాయ‌నాన్ని క‌ల్పిస్తాయి. ఆర్థిక సంస్థ‌ల వ‌డ్డీ రేట్ల‌తో పోలిస్తే బ్యాంకుల ఎమ్‌సీఎల్ఆర్‌కి మార‌డం మేలు. ఎందుకంటే ఎమ్‌సీఎల్ఆర్ విధానంలో వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. దీనితోపాటు రుణం తీసుకునే ముందు ముంద‌స్తుగా ఎమ్‌సీఎల్ఆర్‌ తేదీని ఖ‌రారు చేసిపెట్టుకుంటే తిరిగి మీ రుణం రీసెట్ చేసే వ‌ర‌కు వ‌డ్డీ రేట్లు అదేవిధంగా కొన‌సాగుతాయి. మ‌ధ్య‌లో బ్యాంకులు ఏమైనా వడ్డీ రేట్ల‌ను పెంచితే అప్పుడు పెరుగుతాయి. ఇలా చేస్తే వ‌డ్డీ రేట్ల వ్య‌యం త‌గ్గుతుంది. దీర్ఘ‌కాలానికి రుణ ప‌రిమితి ఉన్న‌ప్పుడు ఇది ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది.

టాప్-అప్ లోన్స్
చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు గృహ రుణాన్ని త‌మ బ్యాంకుకు బ‌దిలీ చేసుకుంటే టాప్-అప్ రుణాల‌ను అందిస్తున్నాయి. ఇది బ‌దిలీ చేసుకునే రుణాల‌కంటే ఎక్కువ‌గా ఉంటాయి. దీనిని గృహ ఆధునికీక‌ర‌ణ‌కు, వైద్య ఖ‌ర్చుల‌కు, కార్‌కొనుగోలు వంటి ఇత‌ర అవ‌స‌రాల‌కు కూడా వినియోగించుకోవ‌చ్చు. ఈ వడ్డీ రేట్ల‌కు రుణాలు వ్య‌క్తిగ‌త రుణాలు, ఇత‌ర వాటికంటే త‌క్కువ‌గా ఉంటాయి. ప్ర‌స్తుతం మీరు బ‌దిలీ చేసుకుంటున్న బ్యాంకులో ఈ స‌దుపాయం లేక‌పోతే, టాప్-అప్ రుణం ఇచ్చే బ్యాంకుల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని