వ్య‌క్తిగ‌త రుణం కోసం కావ‌లసిన అర్హ‌త‌లు ఏంటి?

ఇత‌ర రుణాల‌తో పోలిస్తే వ్య‌క్తిగ‌త రుణాలు చాలా సుల‌భంగా పొంద‌వచ్చు. వ్య‌క్తిగ‌త రుణాల‌ను జారీ చేసేందుకు వినియోగ‌దారుడి రుణ చ‌రిత్ర, ప‌నిచేస్తున్న కంపెనీ, ఆదాయం, నివాసం, పిన్ కోడ్‌, వ‌య‌స్సు వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తారు. వ్య‌క్తిగ‌త రుణాలు వేత‌న జీవుల‌కు, వ్యాపార‌స్తులు, ఇత‌రులు

Published : 18 Dec 2020 21:34 IST

ఇత‌ర రుణాల‌తో పోలిస్తే వ్య‌క్తిగ‌త రుణాలు చాలా సుల‌భంగా పొంద‌వచ్చు. వ్య‌క్తిగ‌త రుణాల‌ను జారీ చేసేందుకు వినియోగ‌దారుడి రుణ చ‌రిత్ర, ప‌నిచేస్తున్న కంపెనీ, ఆదాయం, నివాసం, పిన్ కోడ్‌, వ‌య‌స్సు వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తారు. వ్య‌క్తిగ‌త రుణాలు వేత‌న జీవుల‌కు, వ్యాపార‌స్తులు, ఇత‌రులు ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు. వారి ఆదాయాన్ని బ‌ట్టి రుణ ల‌భ్య‌త‌, వ‌డ్డీ రేట్లు ఉంటాయి. రుణం పొందేందుకు కావ‌లసిన అర్హ‌త‌లు ఏంటో ముందు తెలుసుకోవాలి

కంపెనీ:

మీరు ప‌నిచేస్తున్న కంపెనీని రుణం మంజూరు చేసేందుకు కొన్ని బ్యాంక‌లు ముఖ్య‌మైన ప్రామాణికంగా తీసుకుంటాయి. ప్ర‌ధాన‌ బ్యాంకులు న‌మోదిత కంపెనీల‌లో ప‌నిచేసేవారికే వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందిస్తాయి. మీరు ప‌నిచేసే కంపెనీ జాబితాలో లేకుంటే మీ మిగ‌తా విష‌యాల‌న్నీ స‌రిగ్గా ఉన్నా వ్య‌క్తిగ‌త రుణం ల‌బించ‌క‌పోవ‌చ్చు.

ఆదాయం:

చాలావ‌ర‌కు ప్రైవేటు బ్యాంకులు రుణం దాఖ‌లు చేసుకునేవారికి నెల‌కు రూ.30 వేల క‌నీస ఆదాయం ఉండాల‌ని సూచిస్తాయి. అయితే ప్రైవేట్ ఆర్థిక సంస్థ‌లు ఇవేమీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా సుల‌భంగా రుణాల‌ను అందిస్తాయి.

క్రెడిట్ స్కోర్:

వ్య‌క్తిగ‌త రుణాల‌కు భ‌ద్ర‌త‌తో కూడుకున్న‌వికావు. అందుకే రుణం ఇచ్చే ముందు బ్యాంకులు క్రెడిట్ స్కోర్‌ ఒక్క‌టే ప్రామాణికంగా తీసుకుంటాయి. కూడా రుణాల‌ను అందిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగా లేన‌ప్పుడు రుణ ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంటుంది. ప్రైవేటు బ్యాంకులు క్రెడిట్ స్కోర్ 750 కి పైగా ఉంటే రుణ పంపిణీ చేస్తాయి. ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు క్రెడిట్ స్కోర్ త‌క్కువ‌గా ఉన్నా రుణాల‌ను ఇస్తాయి.

నివాసం:

మ‌నం నివాసిస్తున్న ఇంటిని కూడా బ్యాంకులు వ్య‌క్తిగ‌త రుణాల‌ను అందించేందుకు ప‌రిశీలిస్తాయి. అద్దె భ‌వ‌నంలో నివ‌సించే వారికి ప్రైవేటు ఆర్థిక సంస్థ‌లురుణాల‌ను పంపిణీ చేయవు. సొంత ఇంటిలో నివ‌సించే వారికే రుణాల‌ను అందిస్తాయి. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ప‌రిస్థితులు మారాయి. ప్రైవేట్ బ్యాంకులు కూడా అద్దెకుండేవారికి, షేరింగ్ అపార్ట్‌మెంట్ లో ఉండేవారికి కూడా రుణాలు ఇస్తున్నాయి.

అనుభ‌వం:

ప్ర‌స్తుతం పనిచేస్తున్న సంస్థ‌లో ఎన్ని సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉంద‌న్న‌ది కూడా రుణం ఇచ్చే ముందు బ్యాంకులు గ‌మ‌నిస్తాయి. ఎక్కువ‌గా ఫిన్‌టెక్ సంస్థ‌లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాయి. అయితే త‌క్కువ అనుభ‌వం ఉన్న‌వారికైనా రుణాలు మంజూరు చేస్తాయి. ఒక్కోసారి ఆదాయం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌ట‌కీ ఇవ‌న్నీ అంశాలు రుణ పంపిణీకి అడ్డు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని