ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌లో స‌బ్సిడీ పొంద‌డం ఎలా?

మధ్యతరగతి ఆదాయ వర్గాలు క్రెడిట్ లింక్‌డ్ సబ్సిడీ స్కీం (సీఎల్ఎస్ఎస్) కింద గృహ కొనుగోలకు తీసుకునే రుణంపై విధించే వడ్డీలో రాయితీని పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎమ్ఏఎ), సీఎల్ఎస్ఎస్ లు తక్కువ

Published : 18 Dec 2020 22:10 IST

మధ్యతరగతి ఆదాయ వర్గాలు క్రెడిట్ లింక్‌డ్ సబ్సిడీ స్కీం (సీఎల్ఎస్ఎస్) కింద గృహ కొనుగోలకు తీసుకునే రుణంపై విధించే వడ్డీలో రాయితీని పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎమ్ఏఎ), సీఎల్ఎస్ఎస్ లు తక్కువ ఆదాయ వర్గాలు (ఎల్ఐజి), మధ్యతరగతి ఆదాయ వర్గాలు-1 (ఎంఐజి-I), మధ్యతరగతి ఆదాయ వర్గాలు -2 (ఎంఐజి-II ) వారికీ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో గృహ కొనుగోలుకు లేదా నిర్మాణానికి వారు తీసుకునే రుణంపై విధించే వడ్డీలో రాయితీని అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

అదేవిధంగా మధ్య తరగతి వర్గాల వారికి సబ్సిడీకి అర్హమైన కార్పెట్ ప్రాంతంలో 33 శాతం పెరుగుదల నియమాలలో మార్పు చేయడమైనది. ఇప్పటి వరకు, 120 చదరపు మీటర్లు, 150 చదరపు మీటర్ల పరిమితులు వరుసగా ఎంఐజీ-I, ఎంఐజీ-II ఫ్లాట్లపై వ‌ర్తింప‌జేసారు. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, కార్పెట్ ప్రాంతం లేదా గోడల లోపల ఉన్న ప్రాంతం ( గోడ మందం మినహాయిస్తే ) మధ్య తరగతి వర్గాలు -I కోసం 160 చదరపు మీటర్లు అలాగే మధ్య తరగతి వర్గాలు -II కోసం 200 చదరపు మీటర్లు పెంచారు. ఈ నిర్ణ‌యంతో లబ్ధిదారులకు ప్ర‌యోజ‌నంతో పాటు, హౌసింగ్ రంగం వృద్ధికి తోడ్ప‌డుతుంది.

రుణం మొత్తం:

ఎంఐజీ- I కేటగిరి వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6 లక్షలు నుంచి రూ. 12 లక్షలుగా, అలాగే ఎంఐజీ II కేటగిరి వార్షిక కుటుంబ ఆదాయం రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షలుగా నిర్ణయించారు. సీఎల్ఎస్ఎస్ ఉద్దేశం ఎంఐజీ కేటగిరికి చెందిన ప్రతి ఒక్కరూ సొంతం ఇంటిని కలిగివుండాలనే లక్ష్యానికి మద్దత్తు ఇస్తుంది. గ‌రిష్ఠ కాల‌ప‌రిమితి 20 సంవ‌త్స‌రాలు క‌లిగిన రుణానికి ఈ స‌బ్సిడీ ఉంటుంది. ఇంటి ప‌రిమాణం, రుణం మొత్తంపై ఎలాంటి ప‌రిమితులు లేవు.

స‌బ్సిడీ పొందే విధానం:

మీ బ్యాంకు రుణం జారీ చేసిన‌ త‌ర్వాత మీ త‌రపున బ్యాంకు స‌బ్సిడీని క్లెయిమ్ చేస్తుంది. దీనిని ప‌రిశీలించిన త‌ర్వాత బ్యాంకులోని మీ ఇంటి రుణ ఖాతాలో స‌బ్బిడీ వ‌చ్చి చేరుతుంది. అప్ప‌డు నెల‌వారికిగా మీరు చెల్లించ‌వ‌ల‌సిన‌ ఈఎమ్ఐ మొత్తం త‌గ్గుతుంది. అయితే స‌బ్బిడీ ల‌భించాలంటే మ‌హిళ‌ల పేరు మీద రుణం తీసుకోవాలి. దీనికి ఆధార్ త‌ప్ప‌నిస‌రి. అయితే ఇదివ‌ర‌కే మీరు ఈ స్కీమ్ కింద‌ స‌బ్సిడీ పొంద‌న‌ట్ల‌యితే తిరిగి ల‌భించ‌దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని