రుణాలపై విధించే రుసుములు, వడ్డీలు, పెనాల్టీలు
బ్యాంకులో రుణం సంపాదించేందుకే చాలా విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది. అయితే రుణం వచ్చిన తర్వాత నుంచి క్రమానుగత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. రుణంతో పాటు వివిధ రుసుములు, పెనాల్టీలు ఉన్న విషయాన్ని బ్యాంకులు అంత వివరంగా చెప్పవు. దీని వల్ల రుణ
బ్యాంకులో రుణం సంపాదించేందుకే చాలా విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది. అయితే రుణం వచ్చిన తర్వాత నుంచి క్రమానుగత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. రుణంతో పాటు వివిధ రుసుములు, పెనాల్టీలు ఉన్న విషయాన్ని బ్యాంకులు అంత వివరంగా చెప్పవు. దీని వల్ల రుణ చెల్లింపులు జరిపేటప్పుడు వాటి గురించి రుణం తీసుకున్నవారు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రుణానికి సంబంధించిన రుసుములు, వడ్డీలు, పెనాల్టీలను గురించి తెలుసుకుందాం.
రుణ దరఖాస్తు రుసుము:
ఏ బ్యాంకు రుణానికైనా సాధారణంగా రుణ దరఖాస్తు రుసుములను విధిస్తారు. ఇందులో రుణ దరఖాస్తు పత్రాలు, రుణ దరఖాస్తుదారుడి గురించి విచారించేందుకు అయ్యే ఖర్చులు వంటివి ఉంటాయి.
ప్రాసెసింగ్ రుసుము:
బ్యాంకు రుణాన్ని ప్రాసెస్ చేసేందుకు బ్యాంకుకు వివిధ దశల్లో అయ్యే ఖర్చులను రుణ ప్రాసెసింగ్ రుసుములో భాగంగా పరిగణిస్తారు. కొన్ని బ్యాంకులు నిర్ణీత రుసుములను వసూలు చేస్తూండగా చాలా బ్యాంకులు రుణంలో కొంత శాతాన్ని ప్రాసెసింగ్ రుసుముగా వసూలు చేస్తున్నాయి. ఇది మామూలుగా 0.25 నుంచి 2.50 శాతం లోపు ఉండవచ్చు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ రుసుము:
బ్యాంకులో రుణం తీసుకునే ముందు,తీసుకున్న తర్వాత సమర్పించిన దరఖాస్తులను క్రాస్ వెరిఫికేషన్ చేసేందుకు అయ్యే ఖర్చులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ రుసుము అంటారు.
లీగల్ రుసుము:
ఏదైనా ఆస్తికి సంబంధించి ధ్రువీకరణ జరపడం కోసం బ్యాంకులు లాయర్లను నియమించుకుంటాయి. ఇందుకోసం లాయర్లు తీసుకునే రుసుములను బ్యాంకులు రుణం తీసుకునే వారి నుంచే వసూలు చేస్తాయి.
తనఖా రుసుము:
ఏదైనా ఆస్తిని తనఖా పెట్టి రుణాన్ని తీసుకునేందుకు బ్యాంకు తనఖా రుసుమును వసూలు చేస్తుంది. ఆస్తి విలువను లెక్కించేందుకు బ్యాంకు ప్రత్యేక అధికారిని నియమించుకుంటుంది. ఆస్తి విలువను లెక్కించేందుకు, తదితర వివరాల కోసం అయ్యే ఖర్చును రుణ గ్రహీతే భరించాల్సి ఉంటుంది.
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రుసుము:
రుణం చెల్లించడం మొత్తం పూర్తయిన తర్వాత ఇకపై బ్యాంకుకు ఎటువంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం బ్యాంకులు సాధారణంగా ఎలాంటి రుసుమును వసూలు చేయకపోవచ్చు.
స్విఛ్చింగ్ రుసుము:
వివిధ కారణాల వల్ల ఒక బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని మరో బ్యాంకుకు మార్చుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకులు విధించే రుసుమును స్విచ్చింగ్ రుసుము అంటారు. సాధారణంగా బ్యాంకులు రుణ మొత్తంపై 0.5శాతం వరకూ స్విఛ్చింగ్ రుసుము విధిస్తాయి. కొన్ని బ్యాంకులు రూ.5,000-రూ.10,000 వరకూ వసూలు చేస్తున్నాయి.
వడ్డీ రేట్లు:
ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ -
గృహ రుణాలు తీసుకునేవారు పెద్ద మొత్తంలో ఒకేసారి రుణం తీసుకుంటారు కాబట్టి ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ విషయంలో దేనికి మొగ్గు చూపాలో సందేహిస్తూ ఉంటారు.
ఫిక్స్డ్ వడ్డీ -
రుణ కాలపరిమితి మొత్తానికి మారకుండా ఉండే వడ్డీ రేటును ఫిక్స్డ్ వడ్డీ రేటు అంటారు. ఫ్లోటింగ్ వడ్డీ: మార్కెట్ వడ్డీ రేట్లకు అనుగుణంగా కాలంతో పాటు మారుతూ ఉండే వడ్డీ రేట్లను ఫ్లోటింగ్ వడ్డీ రేటు అంటారు.
సాధారణ వడ్డీ -
బ్యాంకు వద్ద తీసుకున్న రుణం అసలుపై ఏడాదికొకసారి చెల్లించే వడ్డీని సాధారణ వడ్డీగా పరిగణిస్తారు.
చక్ర వడ్డీ -
గడిచిన సంవత్సరానికి చెల్లించిన వడ్డీని ప్రస్తుత ఏడాది అసలుకు కలిపి దాని మొత్తం మీద వడ్డీని లెక్కించడాన్ని చక్రవడ్డీగా భావిస్తారు.
పెనాల్టీలు:
ముందస్తు చెల్లింపు రుసుము( ప్రీపేమెంట్ పెనాల్టీ) -
తీసుకున్న రుణాన్ని గడువు కంటే ముందే చెల్లించాల్సి వస్తే బ్యాంకులు ముందస్తు చెల్లింపు రుసుమును వసూలు చేస్తాయి. గృహ రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీ రేట్లకు సంబంధించి ప్రీపేమెంట్ పెనాల్టీలు వసూలు చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది. మిగిలిన గృహ రుణాలకు ముందస్తుగా చెల్లిస్తున్న రుణంలో 2 నుంచి 5శాతాన్ని పెనాల్టీగా వసూలు చేస్తారు.
ఆలస్య చెల్లింపు రుసుము -
గృహ రుణాలకు ఈఎమ్ఐల రూపంలో చెల్లింపులు జరుపుతూ ఉంటారు. బ్యాంకులు, ఎన్బీఎప్సీలు ఈఎమ్ఐలు ఆలస్యమైతే ఆలస్య చెల్లింపు రుసుమును వసూలు చేస్తాయి. ఈ ఆలస్య చెల్లింపు రుసుములు రూ. 200 నుంచి రూ. 500 వరకూ ఉంటాయి. దీంతో పాటు అదనంగా 2 శాతం వడ్డీని వసూలు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్