ముందస్తు రుణ చెల్లింపు గురించి మీకు పూర్తిగా తెలుసా?
గృహ రుణాలు తీసుకునేటప్పుడు చాలా మంది ఈఎమ్ఐ పద్ధతిని ఎంచుకుంటారు. వాయిదాలు కడుతున్న కొద్దీ ఒక్కోసారి చాలా మొత్తం చెల్లిస్తున్నట్లుగా భావిస్తారు. దీంతో రుణ మొత్తంలో కొంత శాతాన్ని లేదా రుణమంతటినీ ముందస్తుగా చెల్లించేందుకు మొగ్గుచూపుతారు. రుణ వాయిదాలు మొదలైన
గృహ రుణాలు తీసుకునేటప్పుడు చాలా మంది ఈఎమ్ఐ పద్ధతిని ఎంచుకుంటారు. వాయిదాలు కడుతున్న కొద్దీ ఒక్కోసారి చాలా మొత్తం చెల్లిస్తున్నట్లుగా భావిస్తారు. దీంతో రుణ మొత్తంలో కొంత శాతాన్ని లేదా రుణమంతటినీ ముందస్తుగా చెల్లించేందుకు మొగ్గుచూపుతారు. రుణ వాయిదాలు మొదలైన 6 నెలల తర్వాత నుంచి ముందస్తు రుణ చెల్లింపులను చేసేందుకు బ్యాంకులు అంగీకరించే అవకాశం ఉంది.
ముందస్తు రుణ చెల్లింపు కోసం :
* ఆన్లైన్లో అభ్యర్థించవచ్చు
* బ్యాంకు శాఖకు నేరుగా వెళ్లి మేనేజర్‌ను సంప్రదించవచ్చు
* మీ వ్యక్తిగత మెయిల్ ఐడీని బ్యాంకు అధికారిక మెయిల్ ఐడీకి ఈమెయిల్ పంపవచ్చు
*బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేసి ముందస్తు రుణ చెల్లింపు గురించి అడగవచ్చు
కింది సందర్బాల్లో ముందస్తు రుణ చెల్లింపు కోసం ప్రయత్నించవచ్చు:
* మీ దగ్గర తగినంత డబ్బు ఉండి సంపాదన సామర్థ్యం బాగా ఉన్నప్పుడు
* దీర్ఘకాలంలో చెల్లించే వడ్డీ ఎక్కువ అని భావించి నికర వడ్డీని తగ్గించుకోవాలని భావించినప్పుడు ముందుగా నిర్ణయించిన గడువు కంటే ముందే ఆస్తిని మీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు
ముందస్తు చెల్లింపునకు పెనాల్టీ:
బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలివ్వడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం వడ్డీ ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం. దీర్ఘకాలిక రుణాల మీద వడ్డీ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాంకుకు లాభం అదే స్థాయిలో ఉంటుంది. రుణ గ్రహీత ముందే రుణం చెల్లించాలనుకుంటే బ్యాంకు లాభదాయకత మీద ప్రభావం పడుతుంది. అందుకే బ్యాంకులు ముందస్తు చెల్లింపులను నిరుత్సాహపరిచేందుకు చెల్లింపు మొత్తంలో కొంత శాతాన్ని పెనాల్టీగా విధిస్తాయి.
ముందస్తు చెల్లింపు వల్ల ప్రయోజనాలు:
* ముందస్తు రుణ చెల్లింపు కారణంగా వడ్డీరూపంలో చెల్లించాల్సిన అధిక మొత్తాన్ని పొదుపు చేయవచ్చు.
* రుణ కాలపరిమితి తగ్గుతుంది.
* రుణాన్ని ముందస్తుగా చెల్లించనందు వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది
ముందస్తు చెల్లింపు చేయాలా.. వద్దా..
ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు సమకూరినప్పుడు ముందస్తు చెల్లింపు చేయాలా, లేక మరో విధంగా పెట్టుబడులు పెట్టాలా అనే విషయంలో సందేహం తలెత్తడం సహజమే. ఇలాంటి సమయంలో గృహ రుణ వడ్డీ రేట్లను, పెట్టుబడి మీద వచ్చే వడ్డీ రేట్లను(పన్నులు తీసివేసి) పోల్చుకోవాలి.
అన్ని బ్యాంకులు ముందస్తు చెల్లింపునకు అనుమతించే అవకాశం లేదు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ఫ్లోటింగ్ వడ్డీ రేటు కలిగిన గృహ రుణాల విషయంలో పెనాల్టీ లేకుండా ముందస్తు చెల్లింపుకు అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్లను బ్యాంకుకు చూపించాల్సి ఉంటుంది. ఇదివరకూ ఈఎమ్ఐల చెల్లింపులకు సంబంధించి ఏవైనా చెక్కులు జారీ చేసి ఉంటే వాటి స్థానంలో కొత్త చెక్కులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందస్తు చెల్లింపు ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!