క్రెడిట్ రిపోర్టులో 'settled' అని ఉంటే దాని అర్థం ఏంటి?
నిశాంత్, ఒక ఐటీ కంపెనీలో మద్యస్థాయి ఉద్యోగి. అతనికి కంపెనీలో మూడేళ్ల అనుభవం ఉంది. అయితే అతని విద్యార్హతను మరింత పెంచేకునేందుకు ఇప్పుడు అతడు రుణం తీసుకొని ఎంబీఏ పూర్తి చేయాలనుకున్నాడు. విద్యారుణం తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుందని
నిశాంత్, ఒక ఐటీ కంపెనీలో మద్యస్థాయి ఉద్యోగి. అతనికి కంపెనీలో మూడేళ్ల అనుభవం ఉంది. అయితే అతని విద్యార్హతను మరింత పెంచేకునేందుకు ఇప్పుడు అతడు రుణం తీసుకొని ఎంబీఏ పూర్తి చేయాలనుకున్నాడు. విద్యారుణం తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుందని తెలుసుకొని దానికోసం దాఖలు చేశాడు. అయితే తర్వాత కొన్ని గంటల్లో అతనికి క్రెడిట్ రిపోర్ట్ లో settled అని ఉన్నందున రుణం తిరస్కరించినట్లు సమాచారం వచ్చింది.
‘settled’ అర్థం ఏంటి?
నిశాంత్‌కు అంతా అయోమయంగా అనిపించింది. ‘settled’ అని ఉంటే అది సానుకూలమైన అంశమే కదా రుణం ఇవ్వడానికి ఎందుకు తిరస్కరించారన్న విషయం అర్థం కాలేదు. ఇదే విషయాన్ని బ్యాంకుని వెళ్లి అడగ్గా అతనికి విషయం అర్థంమైంది. నిశాంత్ రుణం తీసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు అతడు యూరప్ పర్యటనకు వెళ్లేందుకు వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. క్రెడిట్ కార్డుతో విలువైన మొబైల్ కొనుగోలు చేశాడు.
అయితే ఇక్కడ రుణ తిరస్కారానికి కారణం ఏంటంటే , నిశాంత్ యూరప్ పర్యటన కోసం రుణం తీసుకున్నప్పుడు సమయానికి నెలవారిగా వాయిదాలు చెల్లించాడు. అయితే రుణం ముగిసే సమయంలో ఇతర కారణాల చేత డబ్బు లేనందున, చివరి వాయిదాలు సమయానికి చెల్లించలేకపోయాడు. అయితే దీంతో బ్యాంకు రిపోర్టులో ఈ రుణాన్ని 'settled 'గా పేర్కొంది. దీంతో మరోసారి అతడు రుణానికి దాఖలు చేసిప్పుడు తిరస్కరణకు గురైంది.
మరి దీనికి పరిష్కారం ఏంటి?
మరి దీనికి పరిష్కారం ఏంటని నిశాంత్ అడగ్గా, ఇంతకుముందు బకాయి ఉన్న మొత్తం చెల్లించాల్సిందిగా వారు సలహా ఇచ్చారు. మొత్తం చెల్లించిన తర్వాత ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) బ్యాంకు నుంచి తీసుకొని క్రెడిట్ బ్యూరోకి అందించారు. క్రెడిట్ బ్యూరో, బ్యాంకుని సంప్రదించి ఈ విషయాన్ని సమీక్షించుకొని 30 రోజుల్లో నిశాంత్ క్రెడిట్ రిపోర్ట్‌లో స్టేటస్‌ను ‘settled’ నుంచి ‘closed’ గా మార్చింది.
మీ క్రెడిట్ రిపోర్టులో “settled” అని ఉంటే అది మీ క్రెడిట్ చరిత్రపై ప్రభావం పడుతుంది. అందుకే సమయానికి తీసుకున్న రుణం చెల్లించడం అలవాటు చేసుకోవాలి. క్రెడిట్ కార్డులు కూడా అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంచుకోకపోవడం మంచిది. క్రెడిట్ కార్డులతో రుణాలు చేసి సమయానికి బిల్లులు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. స్టేటస్ ‘settled’ గా చూపిస్తే తిరిగి రుణం లభించేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ అలా జరిగినా ఇప్పటికీ ఉన్న రుణాన్ని చెల్లించి స్టేటస్ మార్చుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?