ఈఎమ్ఐలో కొనాలా? వ‌ద్దా?

ఈ రోజుల్లో ఎంత ధ‌ర ఉన్న వ‌స్తువు కొనాల‌న్నా క‌ష్ట‌మేమీ కాదు. చాలా ర‌కాల ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. అయితే భారీ మొత్తం వెచ్చించి వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేముందు వినియోగ‌దార్లు కొన్ని విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకోవాలి. వ‌స్తువ‌ల‌ను ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసేవారు

Published : 22 Dec 2020 13:57 IST

ఈ రోజుల్లో ఎంత ధ‌ర ఉన్న వ‌స్తువు కొనాల‌న్నా క‌ష్ట‌మేమీ కాదు. చాలా ర‌కాల ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. అయితే భారీ మొత్తం వెచ్చించి వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేముందు వినియోగ‌దార్లు కొన్ని విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకోవాలి. వ‌స్తువ‌ల‌ను ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసేవారు, ముందుగా పొదుపుచేసిన డ‌బ్బుతో కొనేవారి కంటే సుమారు 30 శాతం అధికంగా ధ‌ర చెల్లించాల్సి ఉంటుంది. ఈఎమ్ఐ ఆప్ష‌న్లు విరివిగా అందుబాటులో ఉన్న ప్ర‌స్తుత రోజుల్లో, ఉద్యోగాలు చేస్తున్న యువ‌త‌కు వ‌స్తువులు కొనుగోలు చేయ‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. అయితే దీని వ‌ల్ల క‌లిగే లాభాలేంటి?న‌ష్టాలేంటి? అని తెలుసుకోవ‌డం మంచిది. అవ‌స‌రం, కోరిక రెండింటికి ఉన్న తేడాను గ‌మ‌నించాలి. మీకేదైనా వ‌స్తువు చాలా అవ‌స‌రం అనుకుంటే దాన్ని వెంట‌నే డ‌బ్బు లేదా ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు. అదే ఆ వ‌స్తువు అత్య‌వ‌స‌రం కాకుండా, డ‌బ్బు పోగుచేసుకోవ‌డానికి స‌రిప‌డ స‌మ‌యం ఉంటే మాత్రం డ‌బ్బు పొదుపు చేసి అనంత‌రం కొనుగోలు చేయండి. ఈఎమ్ఐ ద్వారా వ‌స్తువులు కొన‌డం ద్వారా రుణ భారం పెరుగుతూ పోతుంది.

రుణాల‌తో వ‌స్తువులు కొనుగోలు చేస్తే?

ఆర్థిక భారం పెరుగుతుంది: ఈఎమ్ఐ అందుబాటులో ఉంద‌ని అధిక విలువ ఉన్న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే ఆర్థిక భారం మ‌న‌పై ప‌డుతుంది. ప్ర‌తీ నెలా ఈఎమ్ఐ గా కొంత మొత్తాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లించాలి.

అధిక మొత్తం చెల్లించాలి: నేరుగా డ‌బ్బు పెట్టి కొనుగోలు చేసే వ‌స్తువు కంటే ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసే వ‌స్తువుకు అధిక మొత్తం చెల్లించాలి. ఈఎమ్ఐలోఅస‌లు వ‌స్తువు ధ‌ర‌కు, వ‌డ్డీగా కొంత మొత్తం చెల్లించాలి.

ఆప‌ర్చ్యూనిటీ కాస్ట్: ఒక వ‌స్తువును ఈఎమ్ఐలో కొనుగోలు చేస్తే ప్ర‌తీనెలా ఈఎమ్ఐ చెల్లించాలి. దీనిపై వ‌డ్డీ కూడా ఉంటుంది. అదే మొత్తం ఏవైనా పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేస్తే రాబ‌డి క‌లిసి మంచి మొత్తం పొందేందుకు వీలుంటుంది. ఇక్క‌డ ఈఎమ్ఐ ప్ర‌తీ నెల చెల్లించ‌డం ద్వారా ఆ వినియోగ‌దారుడు ఆప‌ర్య్యూనిటీ కాస్ట్ పోతుంది.

ఆర్థిక స్వేచ్ఛ‌కు ఆటంకం: ఉద్యోగంలో చేరిన వెంట‌నే ఈఎమ్ఐలో అధిక విలువ క‌లిగిన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే ఆర్థిక స్వేచ్ఛ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంది. వ‌చ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ఈఎమ్ఐ చెల్లింపుల‌కే పోతే అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు కావాల్పిన‌పుడు ఇబ్బందులు ప‌డాల్సివ‌స్తుంది.

కాబ‌ట్టి ఏవైనా ఖ‌రీదైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే ముందు అత్య‌వ‌స‌ర‌మా? కాదా అని ప్ర‌శ్నించుకోవాలి. అత్య‌వ‌స‌రం అనుకుంటే ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేయ‌డంలో త‌ప్పు లేదు. అదే అంత అవ‌స‌రం లేదు. మ‌రో రెండేళ్లు ఆగినా ఫ‌ర్వాలేదు అనుకుంటే మాత్రం డ‌బ్బును పొదుపు చేసి ఆ త‌ర్వాత కొనుగోలు చేయ‌డం మంచిది. ప్ర‌తీనెలా ఈఎమ్ఐ చెల్లించే బ‌దులు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ గానీ ఇత‌ర పొదుపు ప‌థ‌కాల్లో నెల‌నెలా మ‌దుపు చేసి రెండేళ్ల త‌రువాత‌ ఆవ‌స్తువు కొనేందుకు ప్ర‌ణాళిక‌వేసుకోవ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని