ఎక్కువ రుణ ఖాతాలున్నాయా? ఇలా చేయండి

ఒక‌టి కంటే ఎక్కువ వ్య‌క్తిగ‌త రుణ ఖాతాలు ఉంటే పూర్తిగా రుణాల బారీన ప‌డిపోయిన‌ట్లుగా భ‌య‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. స‌రైన ప్ర‌ణాళిక‌తో ఖాతాల‌ను నిర్వ‌హిస్తే మీ ఆర్థిక స్థితి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ రోజుల్లో ఒక వ్య‌క్తి గృహ రుణం, వాహ‌న రుణం వంటివి తీసుకోవ‌డం సాధార‌ణం అయిపోయింది. అయితే వ్య‌క్తిగ‌త రుణంతో

Published : 23 Dec 2020 09:42 IST

ఒక‌టి కంటే ఎక్కువ వ్య‌క్తిగ‌త రుణ ఖాతాలు ఉంటే పూర్తిగా రుణాల బారీన ప‌డిపోయిన‌ట్లుగా భ‌య‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు. స‌రైన ప్ర‌ణాళిక‌తో ఖాతాల‌ను నిర్వ‌హిస్తే మీ ఆర్థిక స్థితి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఈ రోజుల్లో ఒక వ్య‌క్తి గృహ రుణం, వాహ‌న రుణం వంటివి తీసుకోవ‌డం సాధార‌ణం అయిపోయింది. అయితే వ్య‌క్తిగ‌త రుణంతో పోలిస్తే ఈ రుణాలన్నీ సుర‌క్షిత‌మైన‌వే. వ్య‌క్తిగ‌త రుణాల‌పై వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. కానీ, క్రెడిట్ కార్డ‌తో పోలిస్తే వ్య‌క్తిగ‌త రుణాలు తిరిగి చెల్లించేందుకు వీలుగా, వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ‌గా ఉంటాయి. బ్యాంకులు వేర్వేరు వ‌డ్డీ రేట్ల‌తో వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తుంటాయి. ఇది చాలా సుల‌భంగా, తొంద‌ర‌గా కూడా ల‌భిస్తుంది.

క్రెడిట్ కార్డు కంటే ముందు వ్య‌క్తిగ‌త రుణాల వాయిదాలు చెల్లించండి
ప్ర‌తి నెలా మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌డానికి ముందు వ్య‌క్తిగ‌త రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించ‌డం మంచిది. ఎందుకంటే క్రెడిట్ కార్డు బిల్లులు ఆల‌స్యం చెల్లించ‌డం కంటే, వ్య‌క్తిగ‌త రుణాలు ఆల‌స్యంగా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భ‌వం ప‌డుతుంది. క్రెడిట్ స్కోర్ 50 పాయింట్ల వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. ఎక్కువ‌గా రుణ ఖాతాలు ఉన్న‌ప్పుడు ముందుగా ఏది చెల్లించాలి, ఏది చెల్లించ‌క‌పోతే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌న్న విష‌యంపై బేరీజు వేసుకొని దాని ప్ర‌కారం చెల్లింపులు జ‌ర‌పాలి.

క్రెడిట్ కార్డుపై ఎక్కువ రుణం తీసుకోవ‌ద్దు
ఇప్ప‌టికే మీకు చాలా రుణ ఖాతాలు ఉన్న‌ప్పుడు, మ‌ళ్లీ క్రెడిట్ కార్డు మీద కూడా రుణం తీసుకోవ‌డం స‌రైన నిర్ణ‌యం కాదు. ఒక‌వేళ తీసుకుంటే మీరు నెమ్మ‌దిగా రుణ భారీన ప‌డుతున్న‌ట్లే లెక్క‌. క్రెడిట్ కార్డుపై వ‌డ్డీ రేట్లు వార్షికంగా 35 శాతం నుంచి 40 శాతం వ‌ర‌కు ఉంటాయి. దీంతో మీరు ఎక్కువ మొత్తంలో దీనికే చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. అప్పుడు మిగ‌తా రుణాల వాయిదాలు చెల్లించేందుకు వీలుండ‌క‌పోవ‌చ్చు.

రుణ ఖాతాను ముంద‌స్తుగా మూసివేసే ప్ర‌య‌త్నం చేయండి
మీకు ఎక్కువ‌గా రుణ ఖాతాలు ఉంటే ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది. క్రెడిట్ కార్డు కంటే ముందు ఎక్కువ వ‌డ్డీ రేట్లు క‌లిగిన ఖాతాను మూసివేయాలి. దానిపై వర్తించే ఛార్జీల‌ను చెల్లించే వీలున్న‌ప్పుడు ఈ నిర్ణ‌యం తీసుకోవాలి. క్రెడిట్ కార్డు రుణాల‌ను ముందస్తుగా చెల్లింపు చేసే కంటే ముందు ఇత‌ర ఖాతాల‌ను మూసివేయాలి.

రుణంతో రుణం చెల్లింపు
ఒక‌రు, చాలా రకాల రుణాలు క‌లిగి ఉన్న‌ట్ల‌యితే ఒకే ఒక రుణం పెద్ద మొత్తంలో (debt consolidation loan) తీసుకొని చిన్న వాటిని మొత్తం క‌లిపి ఒకేసారి చెల్లించాలి. అన్ని బ్యాంకులు డెట్ కన్సాలిడేష‌న్ లోన్ అందించ‌వు. రుణ చ‌రిత్ర మెరుగ్గా ఉండి తిరిగి చెల్లింపులు చేసే విధానం స‌రిగా ఉంటేనే బ్యాంకులు పంపిణీ చేస్తాయి. అయితే వీటిపై వ‌డ్డీ రేట్లు వ్య‌క్తిగ‌త రుణాల కంటే ఎక్కువ‌గా ఉంటాయి. ఎక్క‌వ‌గా ప్ర‌ధాన ప్రైవేటు బ్యాంకులు ఈ రుణాల‌ను అందిస్తాయి. మీ బ్యాంకు ఇటువంటి రుణం ఇస్తుందో లేదో తెలుసుకోవాలి. సాధార‌ణంగా ఈ రుణం జారీ చేసేందుకు బ్యాంకులు వ్య‌క్తి ఆదాయం, ఉద్యోగం, క్రెడిట్ చ‌రిత్ర వంటి వివ‌రాల‌ను ప‌రిశీలిస్తాయి.

నెల‌వారి ఖ‌ర్చుల కోసం రుణాలొద్దు
నెల‌వారి బిల్లులు, రుణ వాయిదాలు చెల్లించేందుకు చిన్న రుణాల‌ను తీసుకోకూడ‌దు. దానికి బ‌దులుగా ఇత‌ర ఖ‌ర్చులు చేయ‌కుండా మీరు చెల్లించ‌వ‌ల‌సిన బిల్లులు, రుణాల‌ను తీర్చేయాలి. మ‌రోరుణానికి దాఖ‌లు చేసుకుంటే అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్ర‌భావం చూపుతుంది. దీంతో భ‌విష్య‌త్తులో కూడా రుణం ల‌భించే అవ‌కాశాలు త‌గ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని